19 సెప్టెంబర్ 2018 బుధ‌వారం మీ రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Sep 19, 2018, 9:26 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. గుర్తింపు లభిస్తుంది. పోటీల్లో గెలుపు సాధిస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. ఋణ సంబంధ ఆలోచనల వల్ల విముక్తి ఏర్పడుతుంది.  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలనిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనవసర ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడి సమయం. సంతాన సమస్యలు తలెత్తే సూచనలు. పరిపాలనలో ఒత్తిడిలు ఉంటాయి.  మానసిక ప్రశాంతతను కోల్పోతారు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలనిస్తుంది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక గౌరవ లోపం ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. సౌకర్యాలు ఒత్తిడికి గురిచేస్తాయి. ఆహారం తీసుకోవడంలో సమయ పాలన అవసరం.   ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు ఒత్తిడి. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలనిస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అధికారులవల్ల సంతోషం కలుగుతుంది. సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలనిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనవసర భయాలు వచ్చే సూచనలు ఉంటాయి. కుటుంబంలో అసౌకర్యం ఉంటుంది. ఒత్తిడితో ప్రయాణాలు చేస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. వాగ్దానాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి.  కిం సంబంధ దోషాలు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలనిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఉద్యోగ రీత్యా ప్రయాణాలు ఉంటాయి. వేరు వేరు చోట్లకు టాన్ఫర్స్‌ అయ్యే సూచన కనబడుతుంది. శారీరక శ్రమ అధికం. పనుల్లో కార్యసాధన ఉంటుంది. శ్రమాధిక్యం. గుర్తింపు లభిస్తుంది. ఆలోచనల్లో ప్రణాళికలు ఉంటాయి. సూర్యారాధన, లక్ష్మీపూజ, శ్రీరామ జపం మంచి ఫలితాలనిస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనవసర ఖర్చులు ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. విశ్రాంతికై ఆలోచిస్తారు. ఇతరులపై ఆధారపడతారు.  దూర ప్రయాణాలపై ఆలోచిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలనిస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.  పనుల్లో నూతనోత్సాహం ఉంటుంది. సమిష్టి ఆశయాలు నెరవేరుస్తారు. సమిష్టి ఆదాయాలు వస్తాయి. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలనిస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఉద్యోగంలో ఉన్నతికై ప్రయత్నం చేస్తారు. సంఘంలో గౌరవం  లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలకై ఆలోచన పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. అధికారిక పనులపై దృష్టి పెడతారు. రాచకార్యాలు పెరుగుతాయి. బరువు బాధ్యతలు ఒత్తిడి అధికం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలనిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విద్యార్థులకు గట్టి   పోటీ ఉంటుంది. పరిశోధనలపై ఆలోచిస్తారు. సంతృప్తి లోపిస్తుంది. దూరదృష్టి పెరుగుతుంది. ఒత్తిడి అధికం అవుతుంది. ఊహించని కష్టాలు వస్తాయి. పరాక్రమం పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలనిస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఒత్తిడి పెరుగుతుంది. లాభనష్టాలు అధికం అవుతాయి. ఆకస్మిక ఇబ్బందులు వచ్చే సూచన. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అనవస విషయాల్లో జోక్యం మంచిది కాదు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలనిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : నూతనోత్సాహం కోల్పోతారు. ఆలోచనలు పెరుగుతాయి. నూతనపరిచయాల వల్ల ఒత్తిడి.  గుర్తింపుకై ఆరాట పడతారు. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అనవసర ఇబ్బందులు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచి ఫలితాలనిస్తుంది.

డా.ప్రతిభ

click me!