రాశులు, వాటి స్వభావాలు ఎలా ఉంటాయి

By ramya neerukondaFirst Published Sep 18, 2018, 3:08 PM IST
Highlights

వీరికి చురుకుదనం ఎక్కువ. చాంచల్యం కూడా ఉంటా యి. మార్పును కోరుకుంటూ ఉంటారు.

రాశులను స్వభావాల ఆధారంగా చర, స్థిర ద్వి స్వభావ అని 3 రకాలుగా విభజించారు.  మేషం, కర్కాటకం, తుల, మకరం చరరాశులు; వృషభం, సింహం, వృశ్చికం, కుంభం స్థిర రాశులు; మిథునం, కన్య, ధనస్సు, మీనం ద్విస్వభావరాశులు.

చర రాశులు : వీరికి చురుకుదనం ఎక్కువ. చాంచల్యం కూడా ఉంటా యి. మార్పును కోరుకుంటూ ఉంటారు. చర రాశి కదా ! అభిప్రాయాలు, ఆలోచనావిధానాల్లో మార్పులు ఉంటా యి. స్థిరత్వం తక్కువగా ఉంటుంది. చర అంటే కదలిక ఎక్కువ అని అర్థం. అంటే ఈ రాశుల్లో వారు ఎక్కువగా ఒకచోట కూర్చోడానికి ఇష్టపడరు. తిరిగి చేసే పనులు అంటే వీరికి ఎక్కువ ఇష్టం. ఈ చర రాశుల్లో మేషం బేసి రాశి, కర్కాటకం సరిరాశి, తుల బేసి రాశి, మకరం సరిరాశి. రెండు బేసి రాశులు రెండు సరిరాశులు ఉన్నాయి.

మేషం అగ్ని తత్వం, చరరాశి, బేసిరాశి కావడం వల్ల వీరి ఆలోచలను ఆచరణలను ఒకేవిధంగా ఉంటాయి. అన్ని పనులు వీరు ప్రణాళికాబద్ధంగా చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కర్కాటకం, సరిరాశి, జలతత్వం, చరరాశి కావడం వల్ల కొంచెం భయం, పిరికితనం ఉండడం వల్ల పనుల్లో కొంత ఆలస్యం ఉంటుంది. తుల, బేసి, చరరాశి, వాయుతత్వం ఉండడం వల్ల వీరికి కూడా కార్యసాధన అధికంగా ఉంటుంది. వీరు తక్కువ శ్రమతో ఎక్కువ పనులు చేయగలిగే నైపుణ్యాన్ని కలిగి ఉంటా రు. వీరు కొంత దృష్టి పెడితే ఆధ్యాత్మిక ఆలోచనల వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకరరాశి ఇది సరిరాశి, భూతత్వరాశి, చరరాశి కావడం వల్ల కూర్చున్నచోటే సంపాదించాలి, ఎక్కువ తిరగకూడదు  అని ఆలోచిస్తారు.

స్థిరరాశులు : వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. స్థిరాస్తులు సంపాదించాలనే కోరిక. ఒకచోట కూర్చుండి సంపాదిస్తారు. తిరగడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. మార్పులకు ఎక్కువగా ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే వీరికి స్థిరత్వం పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశుల్లో వృషభం, సింహం, వృశ్చికం, కుంభం వస్తాయి. వీటిలో వృషభం సరిరాశి, సింహం బేసిరాశి, వృశ్చికం సరిరాశి, కుంభం బేసిరాశి. రెండు బేసి రాశులు, రెండు సరి రాశులు ఉంటా యి.

వృషభం భూతత్వం, స్థిరం, సరిరాశి కావడం వలన అన్ని తనలో దాచుకుటారు. వేటిని తొందరగా బయటపెట్టరు. కొంత పిరికి స్వభావం, స్థిరాస్తుల సంపాదనపై దృష్టి ఉంటుంది. సింహం అగ్నితత్వరాశి, బేసిరాశి, స్థిరరాశి కావడం వల్ల కూర్చున్నచోట సంపాదించాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటా యి. వీరి ఆలోచనల్లో ప్రణాళిక స్థిరత్వం ఉంటాయి. తొందరపాటు అస్సలు ఉండదు. తాము ఎవ్వరి దగ్గరికీ వెళ్ళకుండా అందరూ తమదగ్గరికే వచ్చే రకంగా ఏర్పాటు చేసుకు ఉంటారు. వృశ్చికం సరిరాశి స్థిరరాశి, జలతత్వరాశి. ఆలోచనల్లో కొంత పిరికితనం, కొంత భయం ఉంటాయి. అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరినీ నొప్పించే మనసు కాదు వీరిది. కుంభం బేసిరాశి, స్థిరరాశి, వాయుతత్వం కావడం వల్ల వీరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు సంపాదించాలని, తమ ఆలోచనలు ఏవిధంగా ఉంటాయో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు. చాలా గుంభనంగా ఉంటారు. అన్నీ చూసీ చూడనట్టు ఊరుకుంటూ పట్టించుకోకుండా ఉంటామని అంటారు కాని బయటపడరు. 

ద్విస్వభావరాశులు : రెండువైపులా ఆలోచిస్తారు. ద్వంద్వ వైఖరిపై దృష్టి ఉంటుంది. ప్రతీ విషయాన్ని సందేహిస్తూ ఉంటా రు. వేరు వేరు ఆశయాలు ఉంటాయి. ఒకదానిపై నమ్మకం తక్కువగా ఉంటుంది. సెకండ్‌ ఒపీనియన్‌పై దృష్టి పెడతారు. వీరు మధ్యవర్తులుగా బాగా పనికివస్తారు. ఈ రాశుల్లో మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఉంటాయి. ఇందులో  కూడా రెండు బేసి, రెండు సరి రాశులు ఉంటాయి.

మిథునం బేసి రాశి, ద్విస్వభావ రాశి, వాయుతత్వరాశి కావడం వల్ల ఆలోచనలు తొందరగా బయట పెట్టరు. అన్నీ తమకు అనుకూలంగా అనిపిస్తేనే ఒక పని చేయడానికి ముందుకు వెళతారు. పనుల్లో కార్యసాధన ఉంటుంది. కన్య ఇది సరిరాశి, భూతత్వం, స్థిరరాశి. వీరి ఆలోచనలు కొంత పిరికిగా ఉంటాయి. ఒకసారి కూర్చుని సంపాదించాలి, మరోసారి తిరగాలి అనే ఆలోచనలు ఉంటా యి. ఎదుటివారిని ఆకర్షించే శక్తి బాగా ఉంటుంది. కాబ్టి వీళ్ళు మీడియా రంగంలో బాగా రాణించ గలుగుతారు. ధనుస్సు ఇది బేసిరాశి, అగ్నితత్వం, ద్విస్వభావం ఒక పని మొదలు పెడితే గురిచేసి ఆ పనిని పూర్తిచేయడానికి ఎక్కువ కష్టపడతారు. మొండితనంతో ఎక్కువగా ఉంటారు. కార్యసాధన ఉంటుంది. మీనం సరిరాశి ద్వి స్వభావం, జలతత్వం. వీరు కళాకారులుగా రాణించే అవకాశం ఉంటుంది. ఆలోచనల్లో సున్నితత్వం ఉంటుంది. కవులుగా రాణిస్తారు. ఎవరి సహాయ సహకారాలు లేకుండా వీరు ఏ పని చేయలేరు. భయం ఎక్కువగా ఉంటుంది.

ఏ రాశివారి ఆలోచనలు స్వభావాల ఆధారంగా ఏవిధంగా ఉంటా యో చూసుకుని వాటికి అనుగుణంగా తమ ఆలోచనలను ఉన్నత స్థితివైపు మలచుకునే ప్రయత్నం చేసుకోవడం మంచిది.

డా|| ఎస్‌. ప్రతిభ

click me!