18 సెప్టెంబర్ 2018 మంగ‌ళ‌వారం మీ రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Sep 18, 2018, 9:25 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనారోగ్య సూచన ఉంటుంది. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. నూతన పరిచయాల వల్ల కొత్త ఆటంకాలు కలిగే సూచన. పదిమందిలో గౌరవం కోసం ఆరాటపడతారు. పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసే పనుల్లో సంతృప్తి తక్కువగా ఉంటుంది. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. ఊహించని ఇబ్బందులు ఉంటా యి. పోటీల్లో గెలుపై ఆరాటం. శత్రువులపై శ్రమతోవిజయ సాధన ఉంటుంది. ఋణ ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. అనారోగ్య భావన ఉంటుంది.గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతానం వల్ల శుభ పరిణామాలు వింరు. సృజనాత్మకత పెరుగుతుంది. విద్యార్థులకు అనువైన సమయం. శుభకార్యాల్లో పాల్గొనే సూచన ఉంటుంది. కళాకారులకు అనువైన సమయం ఉంటుంది. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాలకోసం ఎదురు చూపులు ఉంటా యి. సౌకర్యాలపై దృష్టి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉండాలి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. ఆహారం సమయానికి లభిస్తుంది. సుగంధ ద్రవ్యాలకోసం ఎదురు చూస్తారు. సంతృప్తి ఉంటుంది. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్త్రీల సహకారం లభిస్తుంది. ప్రచార, ప్రసార సాధనాలు అనుకూలిస్తాయి. పఠనాసక్తి పెరుగుతుంది. రచనలపై దృష్టి పెంచుకున్నారు. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. చేసే పనుల్లో సంతృప్తి లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శ్రీమాత్రే నమః జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. కళాకారులకు అనుకూలమైన సమయం. వాగ్దానాలు నెరవేరుస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. నిల్వ ధనం పెరచుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : కొంత శారీరక ఒత్తిడి లభిస్తుంది. చేసే పనుల్లో సులభమైన మార్గాల అన్వేషణ ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పు ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు.  సౌకర్యాలకోసం అన్వేషణ ఉంటుంది. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విశ్రాంతి లభిస్తుంది. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు ఉంటా యి. ధనవ్యయం అధికం చేస్తారు. కొంత మానసిక విశ్రాంతి అవసరం. సుఖపడాలనే ఆలోచన ఎక్కువౌవుతుంది. పరాధీనత ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆలోచన. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పనుల్లో సంతృప్తి ఉంటుంది.  స్త్రీల ద్వారా ఆదాయ మార్గాన్వేషణ ఉంటుంది. కళానైపుణ్యం పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు ఉంటా యి. సమిష్టి ఆదాయాలు వస్తాయి. కళాకారులకు అనువైన సమయం ఉంటుంది. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అధికారులతో అనుకూలత ఉంటుంది. అధికారిక పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగంలో జాగ్రత్తలు పాటించాలి. అధికారిక ప్రయాణాలపై దృష్టి పెడతారు. ఊహించని ఇబ్బందులు ఉంటా యి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శుభకార్యాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు.  అనుకున్న పనులు పూర్తిచేయడానికి శ్రమ పడతారు. దూరదృష్టి ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి సమయం. పరిశోధనలపై దృష్టి పెడతారు. జాగ్రత్త అవసరం. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఊహించని ఆదాయాలు వస్తాయి. శ్రమలేని సంపాదనపైదృష్టి ఉంటుంది. వ్యాపారస్తులకు, కళాకారులకు అనుకూల సమయం. ప్రయోజనాలు అధికంగా ఉంటా యి. క్రయ, విక్రయాలపై దృష్టి ఉంటుంది. పరాధీనత ఏర్పడుతుంది. గౌరీదేవి పూజ, శ్రీమాత్రేనమః నామ జపం ఉపకరిస్తుంది.

డా.ప్రతిభ

click me!