7మార్చి 2019 గురువారం రాశిఫలాలు

By ramya N  |  First Published Mar 7, 2019, 7:05 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అన్ని పనుల్లో ఒత్తిడి ఉంటుంది. పరామర్శలు చేస్తారు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. ప్రతి పనిలో అనుభవం వస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సామాజిక అనుబంధాలు బావుటాంయి. నూతన పరిచయాలు విస్తరిస్తాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. స్నేహసంబంధాలు విస్తృతి చెందే అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు  కొంత జాగ్రత్తగా మెలగాలి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతృప్తి లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేయడంలో ఆలస్యం ఏర్పడుతుంది. అనారోగ్య సూచనలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. చిత్త చాంచల్యం తగ్గుతుంది. ఆరోగ్య నియమాలు పాటించడం మంచిది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంతాన సంబంధ ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతతను వెతుక్కుటాంరు. సృజనాత్మకతో పనులు పూర్తిచేస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. చేసే పనుల్లో సంతోషం లభిస్తుంది. ఊహించని ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రయత్నంతో సాధిస్తారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఆహారంలో సమయ పాలన అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గృహ ప్రయత్నాలు మానుకోవాలి. గృహ సంబంధ ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అనారోగ్య లోపాలు ఉంటాయి. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. అనుకున్నంత సంతోషం లభించదు. జాగ్రత్త అవసరం. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : గురువులతో అనుబంధంలో లోపాలు ఏర్పడతాయి. కమ్యూనికేషన్స్‌ వల్ల కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దగ్గరి ప్రయాణాలకు ప్రయత్నం చేస్తారు.   విద్యార్థులకు అనుకున్నంత సులభంగా ఫలిత సాధన ఉండదు. కొంత శ్రమ ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వాక్‌దానాలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలపై దృష్టి పెంచుకుంటారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. చిత్త చాంచల్యం తగ్గుతుంది. కిం సంబంధ లోపాలు పోతాయి. విద్యార్థులకు సంతోషం శ్రమానంతరం లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శారీరక శ్రమ ఏర్పడుతుంది. ఆలోచనలకు అనుగుణంగా రూపకల్పనలు మారుతాయి. ప్రణాళికా పరమైన పనులు పూర్తి చేస్తారు. చిన్న చిన్న లోపాలు సరిచేయబడతాయి. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. తదనంతరం సంతోషం ఉంటుంది. విద్యార్థులు కొంత శ్రమపడవలసి ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక యాత్రలకై ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దానధర్మాలకు డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గురువులతో సత్‌ సాంగత్యం పెంచుకుంటారు. దేవాలయాల్లో ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేస్తారు. అన్ని రకాల ఆనందాలు పూర్తి చేస్తారు. అన్ని రకాల లాభాలు సంపాదిస్తారు. పనుల వల్ల ప్రశాంతత ఏర్పడుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందరినీ కలుపుకుంటూ పనులు పూర్తి చేసుకోవాలి. ఉద్యోగస్థులు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలకై ఆలోచించరాదు. శ్రీదత్త శ్శరణం మమ జపం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : దూర ప్రయాణాలపైదృష్టి ఏర్పడుతుంది. విదేశీ వ్యవహారాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. పరిశోధనలపై ఆసక్తి పెంచుకుంటారు. అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది.  అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆనందమయ జీవితం గడుపుతారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!