5మార్చి2019 మంగళవారం రాశిఫలాలు

By ramya N  |  First Published Mar 5, 2019, 6:53 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఒత్తిడి అనంతరం సంతోషం లభిస్తుంది. గౌరవహాని ఏర్పడుతుంది. సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీ లలితాసహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) :  చేసే ఉద్యోగంలో సంతోషం పెరుగుతుంది. ఆనందకర వాతావరణం. సంఘంలో గౌరవం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలపై ఆసక్తి ఉంటుంది. పెరచుకునే ఆలోచన. ఇతరుల సహకారాలు లభిస్తాయి. పరాక్రమం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సుబ్రహ్మణ్యారాధన మేలు చేస్తుంది.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) :  గౌరవ హాని జరుగుతుంది. న్యాయ అన్యాయ విచారణ చేస్తారు. సంతృప్తి లోపం ఉంటుంది. నిల్వ ధనాన్ని కోల్పోయే సూచనలు ఉంటాయి. వాగ్దానాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది.  మధ్య వర్తిత్వాలు పనికిరావు. కుటుంబంలో ఒత్తిడితో కూడిన వాతావరణం. శ్రీ దత్త శ్శరణం మమ జపం ఉపయోగపడుతుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాలు ఒత్తిడికి గురిచేస్తాయి. ఇతరులపై ఆధారపడతారు. వ్యాపారస్తులకు ఒత్తిడి సమయం. ఆకస్మిక ప్రమాదాలు జరిగే సూచనలు. శారీరక శ్రమ ఉంటుంది. అనవసర భయాలు పెరుగుతాయి. ఊహించని ఆటంకాలు వచ్చే సూచనలు ఉంటాయి.  శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన మంచి చేస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. పరస్పర సహకారాలు కోల్పోతారు. చేప్టిన పనుల్లో ఒత్తిడి ఉంటుంది. మధ్యలో ఆపే సూచనలు. అనవసర ప్రయాణాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. విశ్రాంతి తక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. హనుమత్‌ ప్రదక్షిణలు మేలు చేస్తాయి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  అప్పులు కొంత వరకు తగ్గే సూచనలు ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇతరులవల్ల ఆదాయాలు పెంచుకునే మార్గం. శ్రమలేని ఆదాయంపై దృష్టి ఉంటుంది. అన్ని రకాల ఆదాయాలు పెరుగుతాయి. శ్రీరామజయరామజయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సంతాన సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు అధిక శ్రమ ఉంటుంది. పరిపాలన సమర్ధత తగ్గుతుంది. ఆత్మీయులు దూరమయ్యే సూచనలు. రాజకీయ విషయాలపై దృష్టి ఉంటుంది.  గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అనవసర ఒత్తిడులు అధికంగా ఉంటాయి. సుబ్రహ్మణ్యారాధన మేలు చేస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. విద్యార్థులకు ఒత్తిడి కాలం. మాతృ వర్గీయులతో మాట ప్టింపు తగ్గించుకోవాలి.అనవసర ప్రయాణాలు చేస్తారు. అధిక శ్రమతో తక్కువ ఫలితాల సాధన ఉంటుంది. పరిశోధకులు జాగ్రత్త అవసరం. విందుభోజనాలపై దృష్టి. హనుమత్‌ ప్రదక్షిణలు మేలు చేస్తాయి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) :  ప్రచార ప్రసార సాధనాల వల్ల అనుకున్న తృప్తి ఉండదు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ఆపరేషన్‌ వాయిదా వేయుట మంచిది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. చెడుసాహవాసం.  శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) :  విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. సౌకర్యాల వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోతారు. నిల్వ ధనం తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. సామాజిక అనుబంధాలు తగ్గుతాయి. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. లక్ష్మీ అష్టోత్తర పారాయణం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అన్ని విషయాల్లో లోపాలు కనిపిస్తాయి. గుర్తింపుకోసం ఆరాట పడతారు. పోటీల్లో గెలుపుకై ఆరాటం ఉంటుంది. శత్రువులపై విజయ సాధనకు ప్రయత్నిస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. ఋణసంబంధ ఆలోచనల నుంచి విముక్తి ఉంటుంది. హనుమత్‌ ప్రదక్షిణలు మేలు చేస్తాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) :  ప్రమాద సూచనలు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. సంతాన సమస్యలు అధికం అవుతాయి. విద్యార్థులకు అధిక ఒత్తిడితో  తక్కువ ఫలితాలు సాధిస్తారు. సృజనాత్మకత తగ్గుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!