Today Horoscope : ఓ రాశివారికి అనుకోని సంఘటనలు.. ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి..

Published : Feb 23, 2023, 06:43 AM ISTUpdated : Feb 23, 2023, 07:13 AM IST
Today Horoscope : ఓ రాశివారికి అనుకోని సంఘటనలు.. ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి..

సారాంశం

23  ఫ్రిబ్రవరి  2023 గురువారం  మీ  రాశి ఫలాలు. ఈ రోజు ఏ రాశివారికి ఎలాంటి యోగం ఉందో తెలుసుకోండి. రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలలో తెలుసుకుందాం.

పంచాంగం    

సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణ
ఋతువు : శిశిరం
పక్షం : శుక్ల పక్షము                                                                                         
వారము: గురువారం
తిథి : తదియ ఉదయం 7:41 ని వరకు తదుపరి చవితి తెల్లవారుజామున 6:26ని వరకు
నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉదయం 9:03ని వరకు
వర్జ్యం :  రాత్రి 8:43 నుండి 10: 16 ని  వరకు
దుర్ముహూర్తం :ఉ.10.18ని నుండి ఉ11.04ని వరుకు తిరిగి మ. 02.55 నుండి మ.03.41 వరకు.
రాహుకాలం :మ.01.30ని. నుండి మ.03.00ని. వరకు
యమగండం :ఉ.06.00ని. నుండి ఉ.07.30ని.  వరకు
సూర్యోదయం  : ఉ.06.27 ని.లకు
సూర్యాస్తమయం : సా.06.00  ని.లకు


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
పట్టుదలతో చేసేపనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లలతో సరదాగా గడపండి. అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. మనసులో అనేక ఆలోచనలతో భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు తగ్గును.

ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
తలపెట్టిన పనులన్నీ వెంటనే పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం కలుగుతుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆధరాభిమానాలు లభించును. సమాజంలో  గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేస్తారు. సమస్యలన్నీ పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈరోజు దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3) :
బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేసేపనులు సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి.సంతానం వల్ల శుభవార్తలు వింటారు., నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేస్తారు. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈరోజు గురవే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. గృహమునందు ఆనందకరమైన వాతావరణం. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సంఘంలో మీ  ప్రతిభకు తగ్గ గౌరవం పెరుగుతుంది. మానసికంగా, శారీరకంగా బలపడతారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలకమైన సమస్యలను బుద్ధి కుశలతతో పరిష్కారం చేస్తారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం దామోదరాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
వృత్తి వ్యాపారాల యందు ఉహించని ధనలాభం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి బంధుమిత్రుల తోటి చర్చిస్తారు. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును. ఉద్యోగంలో పై అధికారుల ఆశీస్సులు లభించును. సమాజమునందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగును. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
చేయుపనులు పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడతాయి. సమాజంలో మీరు చేయని పనులకు బాధ్యతలు మీ  మీద పడి అవమానాలకి గురవుతారు. వాదనలకు దూరంగా ఉండండి. కొన్ని సమస్యలు మనసులో చికాకులు పుట్టిస్తాయి. దురాలోచనులకు దూరంగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఖర్చులు చేసేప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ఈరోజు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
శారీరక శ్రమ అధికమై శరీర బాధలు పెరుగును. కొన్ని విషయాలు వినడం వలన మానసికంగా బాధపడతారు. చేయుపనులలో తొందరపాటు నిర్ణయాల వలన ఆటంకాలు ఏర్పడను. బంధుమిత్రుల తోటి కలహాల రావచ్చు. వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని వలెను. ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడిలు ఎక్కువగా నుండును. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. కుటుంబ సభ్యుల తోటి సఖ్యతగా ఉండవలెను. ఈ రాశి వారు ఈ రోజు దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
చేయ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగము నందు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లలతో సరదాగా గడపండి. అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. మనసునందు అనేక ఆలోచనలతో భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ధన నష్టం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు తగ్గును.
ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగును. గృహమునకు కావలసిన వస్తువుల గూర్చి అధికంగా ఖర్చు చేస్తారు. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగమునందు పైఅధికారుల ఆధరాభిమానాలు పొందుతారు.
నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకునట్లుగా పూర్తగును. రావలసిన పాత బాకీలు వసూలు అవును. శారీరిక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2 ):
సమాజంలో ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు లభించును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం కలుగును. ప్రయాణాలు కలిసి వస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దాంపత్య జీవితం ఆనందంగా గడుపుతారు. ఇతరులతో చేసే వ్యవహారంలో మృదువుగా సంభాషణ చేస్తూ వ్యవహారాన్ని చక్క పెట్టవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
చేయుపనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగము నందు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లలతో సరదాగా గడపండి. అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతో కలహాలకు దూరంగా ఉండండి. మనసునందు అనేక ఆలోచనలతో భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. సమాజంలో  గౌరవ ప్రతిష్టలు తగ్గును.
ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఎదుటివారిపై ఆవేశం తగ్గించుకొని మాట్లాడవలెను. వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది. సమాజంలో మీ మాట విలువ తగ్గుతుంది. ఉద్యోగంలో అధికారులతో పేచీలు ఏర్పడవచ్చు. మిత్రులు నమక ద్రోహం చేయాలని చూస్తారు. శారీరక శ్రమ పెరిగి శరీరం బలహీన పడుతుంది. కీలకమైన సమస్యలు పెరిగి మానసిక బాధలు ఏర్పడను. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలెను. అనాలోచిత పనుల వలన ఇబ్బందులకు గురవుతారు. పని వారి తోటి ఇబ్బందులు రావచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆర్థికంగా అనుకూలం.. అప్పుల నుంచి విముక్తి!
AI జాతకం: ఓ రాశివారికి ఈ రోజు ఊహించిన లాభాలు