ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. పదిమందిలో గుర్తింపు పెంచుకునే ప్రయత్నం. తమకంటే ఉన్నతులతో ఆచి, తూచి వ్యవహరించాలి. అన్ని పనుల్లో ఒత్తిడి అధికం అవుతుంది.
మేషం :(అశ్విని,భరణి,కృత్తిక 1వపాదం) : లాభాలు సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదర్శవంతమైన జీవితం కోసం ప్రయత్నం చేస్తారు. ఉన్నతాధికారులతో అనుకూలత పెరుగుతుంది. దానధర్మాలు చేస్తారు.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. పదిమందిలో గుర్తింపు పెంచుకునే ప్రయత్నం. తమకంటే ఉన్నతులతో ఆచి, తూచి వ్యవహరించాలి. అన్ని పనుల్లో ఒత్తిడి అధికం అవుతుంది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పరిశోధకులకు మంచి అవకాశం. పరిశోధనలపై ఆలోచనలు పెరుగుతాయి. ఉన్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సంతృప్తి తక్కువగా ఉంటుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సామాజిక అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నూతన పరిచయస్తులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు బంధువులు పెరుగుతారు. భాగస్వామ్య అనుబంధాలు విస్తరింపచేసుకుంటారు. గౌరవం కోసం పాటు పడతారు.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పోటీలలో గెలుపు సాధిస్తారు. ఆటలు మొదలైన విషయాలపై శ్రద్ద పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొండితనంతో పనులు పూర్తి చేస్తారు. అహంకారం పెరుగుతుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : క్రియేటివిటీ తగ్గుతుంది. ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు. మానసిక ఘర్షణ పెరుగుతుంది. సంతాన సంబంధ ఆలోచనల్లో బాధ కలుగుతుంది. ప్రణాళికలకు అనుకూలమైన పనులు పూర్తి చేయడంలో శ్రమ అధికం అవుతుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సౌకర్యాల వలన ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మాతృవర్గీయుల వలన సహకారం కోసం ఎదురుచూపులు. విద్యార్థులకు ఒత్తిడి సమయం. ఇంటి సంబంధ పనులు వాయిదా వేయుట మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సోదర వర్గీయులతో అనుబంధాలు పెంచుకుంటారు. రచయితలకు మంచి అవకాశం. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. మీడియారంగం వారికి కొంత ఒత్తిడి ఏర్పడుతుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వాగ్దానాలు పనికిరావు. మధ్యవర్తిత్వాలు పనికిరావు. నిల్వధనం కోల్పోయే సూచనలు. కుటుంబం సంబంధాల మధ్య బాంధవ్యాలు తగ్గకుండా చూసుకోవాలి. మాట్లాడేటపడు ఆచి, తూచి మాట్లాడాలి. మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఎంతటి కష్టాన్నైనా భరించే శక్తి కలిగి ఉంటారు. ప్రణాళికలను పూర్తిచేసే ప్రయత్నంలో ఉంటారు. పనుల ఒత్తిడి అధికం అవుతుంది. మొండితనంతో పనులు పూర్తిచేస్తారు. ప్రమాదాలకు అవకాశం.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విశ్రాంతికై ఆలోచిస్తారు. తొందరగా దొరకదు. పాదాల నొప్పులు ఉంటాయి. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రమాదాలకు అవకాశం పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.