ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం. ఏ వ్యవహారం చేపట్టినా మందకొడిగా సాగుతుంది.
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-
శుభవార్తలు వింటారు. వ్యాపారాల యందు ధనలాభం. గృహము నందు శుభకార్యములు. సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును..
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :-
అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-
శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. ఓందుర్గాయై నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :-
అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును.సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పోగొట్టు పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం నమశ్శివాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-
కొత్త వస్తువులు కొంటారు. శుభవార్తలు వింటారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. రావలసిన డబ్బు సమకూరుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తులను కలుస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవం. ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేసిన శుభం జరుగును.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :-
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం. ఏ వ్యవహారం చేపట్టినా మందకొడిగా సాగుతుంది. బంధువులు మీపై విమర్శలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. మహాలక్ష్మీ నమః అనే మంత్రమును 21 మార్లు జపించి న శుభం జరుగుతుంది
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :-
రావలసిన బకాయిలు వసూలు చేసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం. శుభకార్యాల వలన ధనవ్యయం. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త పనులకు అనుకూలం. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు దుర్గారాధన చేసిన శుభం జరుగును.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :-
అన్నిటికీ అనుకూలమైన రోజు. విజయ అవకాశాలు ఎక్కువ. మిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి. మీరు అనుకున్న స్థాయికి చేరుకుంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. ఆనందంగా గడుపుతారు. శివారాధన చేస్తే శుభం జరుగును
ధనుస్సు రాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-
చేయు పనులయందు ఆలస్యం. అకారణంగా కోపం. బంధుమిత్రులతో కలహాలు. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాల్లో కొత్త విషయాలు వింటారు. మానసిక ఒత్తిడి. ఓం సూర్యాయ నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :-
చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో కొన్ని చిక్కులు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.అవసరమైన ఆలోచనలు చేస్తారు. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. శివారాధన చేసిన శుభం జరుగును.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-
అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత. అకారణంగా కోపం. పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట. అధికారులతో ఇబ్బందులు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
అవసరమైన గొడవలు. పనులు అనుకున్న రీతిలో పూర్తి. సంఘంలో విశేష ఆదరణ. శుభవార్తలు వింటారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
పంచాగం
శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వైశాఖ మాసం
బ.పంచమి రాత్రి 10:24ని.ల వరకు
పూ.షాఢ నక్షత్రం ఉదయం 07:50ని|| వరకు తదుపరి ఊ.షాఢ
వర్జ్యం మ.03:18ని.ల లగాయతు మ.04:47ని.లవరకు
దుర్ముహూర్తం ఉదయం 08:04ని. లగాయతు 08:55ని.ల వరకు తిరిగి మధ్యాహ్నం 12:21 ని.ల లగాయతు 01:12 ని.ల వరకు
రాహుకాలం ఉదయం 10:30ని.ల లగాయతు మధ్యాహ్నం 12:00ని.ల వరకు
యమగండం మధ్యాహ్నం 03:00ని.ల లగాయతు సా.04:30ని.ల వరకు
సూర్యోదయం ఉదయం 5:31ని.లకు
సూర్యాస్తమయం సాయంత్రం 6:21ని.లకు.