19 ఆగస్టు 2018 ఆదివారం రాశిఫలాలు

Published : Aug 18, 2018, 09:23 AM ISTUpdated : Sep 09, 2018, 12:34 PM IST
19 ఆగస్టు 2018 ఆదివారం రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి. ఉన్నతమైన ఆలోచనలు. పూర్వపుణ్యం పెంచుకునే ప్రయత్నం. శుభకార్యాల్లో పాల్గొంటారు. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. విశాలభావాలు ఏర్పడతాయి. గౌరవం పెరుగుతుంది. గురువులతో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

 

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఇతరులతో వ్యవహరించునప్పుడు జాగ్రత్త అవసరం. అవమానాల పాలు కాకుండా చూసుకోవాలి. చెడు మార్గాల ద్వారా ఆదాయం. చెడు స్నేహాలు, మృతధనం పై ఆశ ఉంటుంది. ఊహించని ఖర్చులు, ప్రమాదాలు జరుగుతాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

 

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో లోపం ఉంటుంది. భాగస్వామ్య సంబంధాలు తగ్గుతాయి. మిత్రులతో ఆచి, తూచి వ్యవహరించాలి. అందరితో జాగ్రత్తగా మెలగాలి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే సూచన. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

 

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శతృవులపై విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపు ఉంటుంది. ఇచ్చిన రుణాలు తిరిగి వస్తాయి. ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనారోగ్య భావన ఏర్పడుతుంది. ఔషధ సేవనం తప్పనిసరి. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సృజనాత్మకతను కోల్పోతారు. కళలపై ఆసక్తి తగ్గుతుంది. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. చిత్త చాంచల్యం ఎక్కువ. సంతానం వల్ల ఇబ్బందులు అధికం. ఆత్మీయతకోసం ఆరాట పడతారు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

 

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాల పై దృష్టి ఏర్పడుతుంది. వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహన సౌఖ్యం కోల్పోతారు. ఆహారంలో సమయ పాలన అవసరం. పనులలో జాప్యం ఏర్పడుతుంది. ప్రాథమిక విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

 

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : రచనలపై ఆసక్తి పెరుగుతుంది. సేవకజన సహకారం పెరుగుతుంది. తోటి వారితో అనుకూలత ఏర్పడుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ఏర్పడుతుంది.  ప్రసార, ప్రచార సాధనాలు అనుకూలం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

 

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాటల వల్ల కొంత వైవిధ్యం, కొంత అనుకూలత ఏర్పడుతుంది.  ఆచి, తూచి వ్యవహరించాలి. కుటుంబంలో జాగ్రత్త అవసరం. నిల్వ ధనంపై దృష్టి పెరుగుతుంది. కంటి సంబంధ లోపాలు రావచ్చు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

 

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శరీర శ్రమ అధికం. అనుకున్న పనులు చేయడంలో జాప్యం ఏర్పడుతుంది. ఆలోచనల్లో అననుకూలత ఉంటుంది. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం. పట్టుదలతో కార్య సాధన అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

 

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకై దృష్టి.  అనవసర ఖర్చులు ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికం. దేహసౌఖ్యం కోల్పోతారు. ఇతరులపై ఆధారపడతారు. ప్రశాంతతకై ఆరాట పడతారు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

 

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సేవకుల ద్వారా ఆదాయం. సేవకజన సహకారం లభిస్తుంది. ఇతరులపై ఆధారపడతారు. ఆదర్శవంతమైన జీవితంకోసం ప్రయత్నం. అన్ని రకాల ఆదాయాలకై ప్రయత్నం, ఉపాసన చేయాలనే ఆలోచన ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

 

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : చేసే వృత్తుల్లో లోపాలు ఉంటాయి. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

డా.పద్మ

PREV
click me!

Recommended Stories

AI Horoscope: ఈ రోజు ఓ రాశివారికి అధికారుల మద్దతు లభిస్తుంది..!
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నిరుద్యోగులకు ఉద్యోగం!