05 నవంబర్ 2019 మంగళవారం రాశిఫలాలు

By telugu teamFirst Published Nov 5, 2019, 7:44 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సమీప వ్యక్తులతో అనుకూలత ఏర్పడుతుంది. ప్రచార, ప్రసార సాధనాలు అనుకూలంగా ఉంటాయి. ఓం నమశ్శివాయ నామ స్మరణ మేలు చేస్తుంది.

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తిచేయడంలో శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకుంటారు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. శతృవులపై విజయం ఉంటుంది. ఋణాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.కలహాలకు పోకపోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసే పనుల్లో తొందర పాటు పనికిరాదు. ఆలోచనల్లో వైవిధ్యం మంచిదికాదు. పరిపాలన సమర్ధత ఉంటుంది. సంతానం వల్ల కాస్త అన్యమనస్కంగా ఉంటారు. జాగ్రత్త అవసరం. ఓం నమశ్శివాయ నామ స్మరణ మేలు చేస్తుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : గృహం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. తీసుకునే ఆహారంలో జాగ్రత్త అవసరం. మెత్తని ఆహారం మంచిది. తల్లికి దూరంగా ఉంటారు. ప్రాథమిక విద్యల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. చదువు విషయంలో శ్రద్ధ అవసరం. ఓం నమశ్శివాయ నామ స్మరణ మేలు చేస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సమీప వ్యక్తులతో అనుకూలత ఏర్పడుతుంది. ప్రచార, ప్రసార సాధనాలు అనుకూలంగా ఉంటాయి. ఓం నమశ్శివాయ నామ స్మరణ మేలు చేస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మాటల్లో అధికారిక ధోరణి ఉంటుంది. తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో కష్టనష్టాలు ఏర్పడతాయి. ఆర్థిక నిల్వలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అనవసర ఖర్చులపై దృష్టి సారిస్తారు. జాగ్రత్త అవసరం. ఓం నమశ్శివాయ నామ స్మరణ మేలు చేస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్య సాధన చేస్తారు. ఆలోచనల్లో మొండితనం ఉంటుంది. చక్కి ప్రణాళికతో పనులు పూర్తి చేస్తారు. అభిరుచుల్లో మార్పులు కనబడతాయి. ఓం నమశ్శివాయ నామ స్మరణ మేలు చేస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విశ్రాంతిలోపం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రమాదాలు జరిగే సూచనలు. అనుకున్న పనులు పూర్తికావడంలో ఒత్తిడి ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యసాధన అవసరం. ఊహించని ఇబ్బందులు ఉండే సూచనలు. దానధర్మాలు చేయాలి. ఓం నమశ్శివాయ

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. కళాకారులకు కొంత ఒత్తిడి సమయం. విద్యార్థులు అధిక శ్రమతో ఫలితాలు సాధిస్తారు. సంతృప్తి తక్కువగా ఉంటుంది. కార్యసాధనకై అధికంగా శ్రమపడాల్సి వస్తుంది. జాగ్రత్త అవసరం. ఓం నమశ్శివాయ నామ స్మరణ మేలు చేస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అధికారులతో అప్రమత్తత. ఉద్యోగులకు ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పేరు ప్రతిష్టలకై ఆరాటం పెరుగుతుంది. సంఘంలో గౌరవం కోసం తపన ఉంటుంది. ఒత్తిడితో కూడుకుని పనులు పూర్తిచేస్తారు. ఓం నమశ్శివాయ నామ స్మరణ మేలు చేస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్య ద్వారా గౌరవం పెరుగుతుంది. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. దూర దృష్టి అధికం అవుతుంది. రాజకీయ విషయాలపై దృష్టి పెడతారు. అధికారం కోసం ఆరాటం ఉంటుంది. ఓం నమశ్శివాయ నామ స్మరణ మేలు చేస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనుకోని ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు ఉంటాయి. ప్లోటాటలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు.  ఇతర విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఓం నమశ్శివాయ నామ స్మరణ మేలు చేస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడులు పెరుగుతుంది. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. నూతన పరిచయాలు పెంచుకోకపోవడం మంచిది. మిత్రులతో ఆనందంగా గడిపే సమయం. పదిమందిలో పలుకుబడికోసం ఆరాటం ఉంటుంది. ఓం నమశ్శివాయ నామ స్మరణ మేలు చేస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!