today astrology :28 నవంబర్ 2019 గురువారం రాశిఫలాలు

Published : Nov 28, 2019, 07:26 AM ISTUpdated : Nov 28, 2019, 10:36 AM IST
today astrology :28 నవంబర్ 2019 గురువారం రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. క్రయ విక్రయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం) : విద్యార్థులకు కష్టకాలం ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి తగ్గుతుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. సంతృప్తి లోపం ఉంటుంది. శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.

వృషభం : (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. క్రయ విక్రయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

మిథునం : (మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. భాగస్వాములతో సంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. పదిమందిలో పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తారు. జీవితం అనుకున్న రీతిలో సాగుతుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం : (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. రుణభారం తగ్గుతుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంతానం వల్ల సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు ఒత్తిడి కాలం. ఆత్మీయతలు తగ్గుతాయి. సృజనాత్మకతను కోల్పోతారు. పరిపాలన సమర్ధత తగ్గుతుంది. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. ఆలోచనా శక్తి కోల్పోతారు.జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : విద్యార్థులు శ్రమతో ఫలితాలు సాధిస్తారు. చేపట్టిన పనులు సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. మాతృసౌఖ్యం తగ్గుతుంది. అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. మృష్టాన్నభోజనంపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

తుల : (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సహకారం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు ఒత్తిడి ఏర్పడుతుంది. రచనలపై ఆసక్తి తగ్గుతుంది. తోటి వారి సహకారాలు లోపిస్తాయి. కమ్యూనికేషన్స వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జపం మంచిది.

వృశ్చికం : (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వాగ్దానాలు వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో అనుకూలతలు ఏర్పడతాయి. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆభరణాలపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) : శారీరక శ్రమ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన అవసరం. చిత్త చాంచల్యం పనికిరాదు. ఆలోచనలకు అనుగుణమైన ప్రణాళికల మార్పు అవసరం. శారీరక గుర్తింపు పెరుగుతుంది. అనుకోని ఇబ్బందులు వస్తాయి. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అనవసర ప్రయాణాలు చేస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. పరాధీనత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

కుంభం : (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఉపాసనను పెంచుకుంటారు. ఆదర్శవంతమైన జీవితంకోసం ఆరాటం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

మీనం : (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. పనుల్లో సంతోషం ఉంటుంది. సంఘంలో గౌరవం ఉంటుంది. ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పదిమందిలో పలుకుబడి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం మంచిది.

 డా.ఎస్.ప్రతిభ

PREV
click me!

Recommended Stories

2026 వృషభ రాశి ఫలితాలు ఇవిగో
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి మొండితనం ఎక్కువ.. భరించడం చాలా కష్టం!