ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పోటీల్లో విజయం సాధిస్తారు. శతృవులపై గెలుపు ఉంటుంది. తీసుకున్న అప్పులు తీర్చాలనే ఆలోచన. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శారీరక ధృఢత్వం కలిగి ఉంటారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) : వ్యాపార అనుబంధాలు బలపడతాయి. వ్యాపారస్తులతో సంతోషం ఏర్పడుతుంది. మిత్రులతో స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. వ్యాపార ధోరణి పెరుగుతుంది. పలుకుబడికోసం ఆరాటం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం చేసుకోవడం మంచిది.
వృషభం : (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పోటీల్లో విజయం సాధిస్తారు. శతృవులపై గెలుపు ఉంటుంది. తీసుకున్న అప్పులు తీర్చాలనే ఆలోచన. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
శారీరక ధృఢత్వం కలిగి ఉంటారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
మిథునం : (మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సృజనాత్మకత పెరుగుతుంది. కళలపై ఆసక్తి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. సంతానం వల్ల సంతోషంకై ఆలోచనలు. ఆత్మీయులతో అనుకూలతలు. పరిపాలన సమర్ధత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం : (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాలపై దృష్టి ఏర్పడుతుంది. ఆహారంలో ఆకుకూరలు అవసరం. ప్రయాణాల్లో సంతోషం ఏర్పడుతుంది. విద్యలో అనుకూలతలు ఉంటాయి. మానసిక ఒత్తిడి కొంత ఏర్పడుతుంది. తల్లితో సంతోషం ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వ్యాపారస్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రచార సాధనాల్లో అనుకూలతలు ఉంటాయి. ప్రసార సాధనాల్లో సంతోషం ఏర్పడతాయి. సమీప వ్యక్తులతో సంతోషం ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది
కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. నిల్వ ధనంపై దృష్టి ఏర్పడుతుంది. సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
తుల : (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : చేసే పనుల్లో చురుకుదనం ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. చక్కటి ఆశయాలు ఏర్పడతాయి. కార్యచరణ ఉంటుంది. భిన్న భిన్న అభిరుచులతో అనుకూలంగా ఉంటారు. చేసే పనిలో కృషి శీలత పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.
వృశ్చికం : (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వ్యాపార పరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. విశ్రాంతికై ఆరాట పడతారు. కొంత మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. పాదాల సంబంధ నొప్పులు ఏర్పడతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది
ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) : వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొంత వ్యాపార ధోరణి ఆలోచనలు పెరుగుతాయి. ఇతరులపై ఆధారపడడం. దురాశలు ఉంటాయి. కళలపై ఆసక్తి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వృత్తిలో సృజనాత్మకత ఏర్పడుతుంది. ఉద్యోగాదులలో సహకారాలు లభిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. తమ తోటివారిపై ప్రేమ, అనురాగాలపై దృష్టి ఉంటుంది. అధికారిత నిరూపించుకుంటారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం మంచిది.
కుంభం : (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : కొత్త పనులతో ఉత్సాహం పెరుగుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. దూర దృష్టి ఏర్పడుతుంది. శాస్త్రజ్ఞానంపై పట్టు సాధిస్తారు. సజ్జన సాంగత్యం లభిస్తుంది. గురువుల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.
మీనం : (పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం. శ్రమలేని సంపాదన పై దృష్టి ఉంటుంది. అనారోగ్య భావన ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.