26 అక్టోబర్ 2019 శనివారం రాశిఫలాలు

By telugu team  |  First Published Oct 26, 2019, 7:38 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంతానం వల్ల అనుకూలత. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సృజనాత్మకత పెరుగుతుంది. దగ్గరి బంధువుల సహకారం. దగ్గరి ప్రయాణాలు. రచనలపై ఆలోచనలు. అతీంద్రియ శక్తులపై ఆలోచన. అనుకున్న పనులు పూర్తి.


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శతృవులపై విజయం సాధిస్తారు. శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.  అప్పులుతీర్చే ఆలోచన, ఇచ్చిన అప్పులు వెనక్కి వచ్చే అవకాశం. పోటీల్లో గెలుపు. సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. ఆహారంలో అనుకూలత. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సంతానం వల్ల అనుకూలత. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సృజనాత్మకత పెరుగుతుంది. దగ్గరి బంధువుల సహకారం. దగ్గరి ప్రయాణాలు. రచనలపై ఆలోచనలు. అతీంద్రియ శక్తులపై ఆలోచన. అనుకున్న పనులు పూర్తి. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మాతృసౌఖ్యం లభిస్తుంది. ఆహారంపై దృష్టి ఎక్కువ. విద్యార్థులు కష్టపడి చదువుతారు. వాహనసౌకర్యాలు ఉంటాయి. మాతృ వర్గీయులతో అనుకూలత. కొంత అనారోగ్య భావన. నిత్యావసర ఖర్చులపై ఆలోచన. క్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : రచనలపై ఆసక్తి. దగ్గరి ప్రయాణాలు. దగ్గరి బంధువుల సహకారం. తోటి వ్యక్తులతో అనుకూలత. మాటల్లో నూతనోత్సాహం. ప్రచార, ప్రసార సాధనాలు అనుకూలిస్తాయి. చదువుపై దృష్టి. సహోద్యోగులతో అనుకూలత. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : నిల్వ ఉన్న ధనం పెంచుకోవాలనే ఆలోచన. కుటుంబంలో సంతోషకరమైన మార్పులు. మాటల్లో అనుకూలత. కంటి సంబంధ అనుకూలతలు. ప్రాథమిక విద్యలపై దృష్టి. అనవసర ఖర్చులు. కొంత జాగ్రత్త అవసరం. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికం. వెంటనే అలసి పోతారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో దృష్టి. ఆలోచనల్లో వైవిధ్యం. ప్రయత్నశీలత ఉంటుంది. కష్టసుఖాలు వెంట వెంటనే మారిపోతాయి.  శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనవసర ఖర్చులపై దృష్టి. నిద్రకు సమయపాలన అవసరం. తెలియని వ్యాధులు. మానసిక ప్రశాంతత కోల్పోవడం, పాదాల సంబంధ నొప్పులు. దేహసౌఖ్యం లోపిస్తుంది. దూర ప్రయాణాలపై దృష్టి. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అనుకోని ఆదాయాలు. స్త్రీల ద్వారా ఆదాయం. కొంత దురాశ ఏర్పడుతుంది. కళానైపుణ్యం. ఆదర్శవంతమైన జీవితం. అన్ని రకాల అభివృద్ధులు. ఉపాసనపై ఆలోచన. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంఘంలో గౌరవం కోసం ఆరాటం. గౌరవం లభిస్తుంది. ఇతరులపై దయ చూపడం, వృత్తి ఉద్యోగాదుల్లో పదోన్నతి. అధికార కాంక్ష, అధికారిక ప్రయాణాలు, ప్రయాణాల్లో సంతృప్తి. ఊహించని ఇబ్బందులు. జాగ్రత్త అవసరం. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : తీర్థయాత్రలపై దృష్టి. విద్య నేర్చుకోవడం వల్ల గౌరవం పెరుగుతుంది. పరిశోధనలపై ఆసక్తి, దూరదృష్టి, గురువులతో అనుకూలత, న్యాయ విషయాలపై దృష్టి. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఊహించని ఇబ్బందులు, అనుకోని కష్టాలు, చెడు సహవాసాలు, చెడు పనులపై ఆసక్తి, చెడు మార్గాల ద్వారా ఆదాయంపై దృష్టి, మానసిక ఒత్తిడి, చిత్త చాంచల్యం, ఇతరులపై ఆధారపడడం, ప్రయాణాల్లో జాగ్రత్తలు, శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక సంబంధాలపై దృష్టి, సమాజంలో గౌరవం, భాగస్వాములతో అనుకూలత, వ్యాపారంపై దృష్టి, పోయిన వస్తువులు లభించడం, పలుకుబడికోసం ఆరాటం, కళత్రంతో అనుకూలత, శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!