23 అక్టోబర్ 2019 బుధవారం రాశిఫలాలు

By telugu team  |  First Published Oct 23, 2019, 7:43 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పు కానీ, బదిలీ కానీ ఉంటుంది


మేషరాశి: ఈ రోజు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. మానసిక ఘర్షణను నివారించండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. మాట విషయంలో జాగ్రత్త వహించండి. అన్నీ విషయాలు ఒకే విధంగా ఉండకపోవచ్చు. అపోహలకు లోనవకండి. ఏ నిర్ణయమైనా ఒకటికి రెం డుసార్లు ఆలోచించి తీసుకోండి. ఆడంబరాలకు దూరంగా ఉండాలి.

వృషభం: ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పు కానీ, బదిలీ కానీ ఉంటుంది

Latest Videos

మిథునం: ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం కానీ, బాగు చేయించటం కానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు కాబట్టి తొందరపాటు మంచిది కాదు.

కర్కాటకం: ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత బాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

సింహం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది.

కన్య: ఈ రోజు మీరు చేసిన సాయం కారణంగా మీ స్నేహితులలో మీ పైన ప్రేమాభిమానాలు ఎక్కువ అవుతాయి. గుర్తింపును, నమ్మకాన్ని పొందుతారు. దూరప్రాంతం నుంచి అనుకోని శుభవార్త వింటారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. బంధువులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.

తుల: ఈ రోజు మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు.

వృశ్చికం: ఈ రోజు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.

ధనుస్సు: ఈ రోజు మానసికంగా ఆందోళన కలిగించే సంఘటన కానీ, అనుకోకుండా డబ్బు ఖర్చు అవటం కాని జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. ఇతరుల విషయాల్లో కల్పించుకొని అవమానాల పాలవద్దు. మా భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవటం మంచిది.

మకరం: ఈ రోజు మీ సంబంధ బాంధవ్యాలను మెరుగు పరచుకోవటానికి అనువైన దినం. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు
తొలగి పోతాయి. మీ ప్రేమను వ్యక్తపరచటానికి కూడా అనుకూలమైన రోజు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత సందర్శన చేస్తారు. సంఘంలో గౌరవం గల వ్యక్తులను కలుసుకుంటారు.

కుంభం: ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. చాలాకాలం నుంచి ఇబ్బంది పెడుతున్న సమస్యపై విజయం సాధిస్తారు. మీ ఇంటికి కావలిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. మీ తల్లితరపు బంధువులను కలుసుకుంటారు.

మీనం: మీ ఆలోచనలను, అభిప్రాయాలను, ప్రేమను వ్యక్తపరచటానికి అనుకూలమైన రోజు. మానసికంగా కొంత ఉత్సాహంతో, కొంత ఆందోళనతో ఉంటారు. ఇతరుల అభిపాయాలను గౌరవించండి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు, ఆడంబరాలకు దూరంగా ఉండటం మంచిది. మీ సంతానం నుంచి ప్రేమాభిమానాలు అందుకుంటారు. మానసిక ఘర్షణను నివారించండి.

click me!