ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. శతృవులపై విజయానికి ఆరాటపడతారు. ఋణాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అనేక రకాల ఇబ్బందులు ఒకేసారి వస్తాయి. వృత్తి విద్యల్లో జాగ్రత్త అవసరం.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాల వల్ల సంతోషం ఏర్పడతాయి. భాగస్వాములతో అనుకున్న పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పలుకుబడికోసం ఆరాటపడతారు. ఆప్త మిత్రులతో జాగరూకతతో ఉండాలి. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. శతృవులపై విజయానికి ఆరాటపడతారు. ఋణాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అనేక రకాల ఇబ్బందులు ఒకేసారి వస్తాయి. వృత్తి విద్యల్లో జాగ్రత్త అవసరం. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతానం వల్ల సంతోషం ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. సంపదలు పెంచుకునే ఆలోచనలో ఉంటారు. సంతృప్తికర వాతావరణం ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మాతృసౌఖ్య లోపం ఏర్పడుతుంది. వాహనాలవల్ల ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక లోపాలు ఉంటాయి. విద్యార్థులు ఒత్తిడికి గురి అవుతారు. ఆహార విషయంలో సమయ పాలన మంచిది. సుగంధ ద్రవ్యాలపై ఆలోచన పెరుగుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సహకార లోపం ఏర్పడుతుంది. సహోద్యోగులతో అప్రమత్తత అవసరం. కమ్యూనికేషన్స్ వల్ల లోపాలు ఉంటాయి. అన్ని రకాల ఆటంకాలు ఏర్పడే సూచన. పరామర్శలు చేస్తారు. చిత్త చాంచల్యం ఉంటుంది. ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : నిల్వ ధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు తొలగుతాయి. మాట విలువ పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. అన్ని రకాల సంతోషాలు ఉంటాయి. కంటి సంబంధ లోపాలు తొలిగే సూచన . శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థాన మార్పు సూచితం. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అభిరుచులకు తగిన పనులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. విశ్రాంతి లోపం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. అన్ని రకాల ఖర్చులుఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ప్టోలి. ఆధ్యాత్మిక ఖర్చులు చేస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కళలపై ఆసక్తి పెరుగుతుంది. అన్ని రకాల ఆదాయాలు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఉపాసనపై దృష్టి ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : చేసే పనుల్లో ఒత్తిడి ఉంటుంది. అధికారులతో అననుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాల్లో ఆటంకాలు. పెద్దల వల్ల భయం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం కోసం ఎదురుచూస్తారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. సజ్జన సాంగత్యం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనే ఆలోచన చేస్తారు. పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనవసర ఖర్చులు చేస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. వైద్యశాలల సందర్శనం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. అన్ని పనుల్లోను ఆటంకాలు ఏర్పడతాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
డా.ఎస్.ప్రతిభ