ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సమయం వృథా అవుతుంది. ధనం దుర్వినియోగం అవుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. జాగ్రత్త అవసరం. దుర్గాపారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఇతరుల సహకారాలు లభిస్తాయి. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులకు ఒత్తిడి కాలం. పనుల్లోఆటంకాలు ఉంటాయి. కళాకారులకు అనుకూల సమయం. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. దగ్గరి ప్రయాణాలపై దృష్టి ఏర్పడుతుంది. దుర్గాపారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మాటల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో అసౌకర్యం ఏర్పడుతుంది. అనవసర ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. శారీరక సౌఖ్యం లోపిస్తుంది. అనవసర ఖర్చులు చేస్తారు. కాలం దుర్వినియోగం అవుతుంది. జాగ్రత్త అవసరం. దుర్గాపారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరక శ్రమ ఉంటుంది. గుర్తింపు లభించదు. అనవసర పనులు చేస్తారు. కాలం దుర్వినియోగం అవుతుంది. శ్రమ ఉపయోగ పడదు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. పనుల పూర్తిలో పట్టుదల అవసరం. ఆలోచనల్లో మార్పులు అవసరం. దుర్గాపారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పాదాల నొప్పులు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. సమయం దుర్వినియోగం అవుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. దుర్గాపారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సమిష్టి ఆశయాల సాధన చేస్తారు. కళాకారులకు అనుకూల సమయం ఉంటుంది. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. సమిష్టి ఆశయ సాధన ఉంటుంది. దురాశ ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. శ్రమలేని ఆదాయం వస్తుంది. దుర్గాపారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అధికారులతో అప్రమత్తత అవసరం. ఉద్యోగంలో నిలకడ ఉండాలి. అనవసర ప్రయాణాలు చేస్తారు. కాలయాపన ఉంటుంది. ఉద్యోగస్తులకు సమయపాలన అవసరం. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. జాగ్రత్తగా మసలుకోవాలి. దుర్గాపారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పరిశోధకులకు కష్టకాలం. విద్యార్థులు ఒత్తిడితో ఉంటారు. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. శుభకార్యాలపైదృష్టి ఉంటుంది. దుర్గాపారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఆటంకాలువస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచన. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. ఆకస్మిక నష్టాలు వచ్చే సూచన ధనం దుర్వినియోగం అవుతుంది. చెడు మార్గాలపై దృష్టి ఏర్పడుతుంది. జాగ్రత్త అవసరం. దుర్గాపారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. సామాజిక అభివృద్ధి లోపిస్తుంది. గౌరవంకోసం ఆరాట పడతారు. భాగస్వాములతో అప్రమత్తత అవసరం.సామాజిక అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. దుర్గాపారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. అనుకున్నంత సాధ్యం కాదు. శత్రువులపై విజయం ఉంటుంది. కాలం సద్వినియోగం చేసుకోవాలి. గుర్తింపుకోసం ఆరాటం పెరుగుతుంది. అనవసర సమస్యలు వస్తాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్త అవసరం. దుర్గాపారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : మానసిక ఒత్తిడి ఉంటుంది. సంతాన సమస్యలు ఏర్పడే సూచనలు ఉంటాయి. విద్యార్థులకు కష్టకాలం. సృజనాత్మకతను కోల్పోతారు. పరిపాలన సమర్ధత తగ్గుతుంది. సమయం దుర్వినియోగం అవుతుంది. అనవసర కాలయాపనలు జరుగుతాయి. దుర్గాపారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
డా.ఎస్.ప్రతిభ