ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సజ్జనుల సాంగత్యం ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. పనుల్లో సంతృప్తి తక్కువగా ఉంటుంది. ఊహించని ఇబ్బందులు వస్తాయి. విద్యార్థులకు కష్టకాలం. దూరదృష్టి ఉంటుంది. శివారాధన, శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. అనారోగ్య సూచన. వైద్యశాలల సందర్శనం. ఊహించని ఆటంకాలు ఉంటా యి. అనవసర ఖర్చులు చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. చెడు సహవాసం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. నూతన పరిచయాల వల్ల ఇబ్బందులు. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. చేసే అన్ని పనుల్లో ఆలస్యాలు సూచితం. ఆలోచిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు అభివృద్ధి చెందుతాయి. రుణబాధలు తీరుతాయి. శతృవులపై విజయం లభిస్తుంది. పోటీల్లో గెలుపు సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంతాన సమస్యలు ఏర్పడే సూచన. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సృజనాత్మకతను కోల్పోతారు. విద్యార్థులకు కష్టకాలంగా ఉంటుంది. చేసే అన్ని పనుల్లోను జాగ్రత్తలు అవసరం. ఉపాసన పరమైన అభివృద్ధి పెంచుకుటా ంరు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాలు ఒత్తిడికి గురిచేస్తాయి. ఆలోచనల్లో నెమ్మదితనం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శరీరానికి వ్యాయామం అవసరం. అనారోగ్య సమస్యలు వచ్చే సూచన పరామర్శలు ఉంటాయి. మాతృసౌఖ్యం తక్కువ. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సేవకజన సహకార లభిస్తుంది. అన్ని రకాల ఆదాయాలు వస్తాయి. సేవకులతో అనుకూలత ఏర్పడుతుంది. ప్రచార, ప్రసార సాధనాలు వృద్ధి చెందుతాయి. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. తోటి వారు సుఖ సంతోషాలతో ఉండేట్లు చూస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో ఆటంకాలు ఏర్పడతాయి. నిల్వధనం కోల్పోయే ప్రమాదం. అన్ని రకాల ఆటంకాలు వస్తాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ధనం దాచడం వల్ల హాని కలిగే సూచన. వాగ్దానాలు చేయరాదు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడే సూచన. జాగ్రత్త అవసరం. ఖచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి. కార్యసాధనలో పట్టుదల అవసరం. గుర్తింపు అంతగా ఉండదు. శ్రమపడడానికి సిద్ధపడాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అనవసర ఖర్చులు చేస్తారు. ఉద్యోగస్తులకు బదిలీలు అయ్యే సూచనలు. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు వచ్చే సూచనలు. ఆధ్యాత్మిక యాత్రలకై దృష్టి వెడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సేవకుల ద్వారా ఆదాయ మార్గాలు ఉంటా యి. ఆదర్శవంతమైన జీవితానికై ప్రయత్నం చేస్తారు. కళాపోషకులుగా ఉంటా రు. షేర్ మార్కెట్లపై దృష్టి సారిస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శ్రమలేని సంపాదనపైదృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : చేసే పనుల్లో ఒత్తిడి, చికాకులు ఏర్పడతాయి. అధికారులతో అప్రమత్తత అవసరం. సంఘంలో గౌరవహానికలిగే సూచన. అనవసర విషయాల్లో జోక్యం మంచిదికాదు. రాజకీయాల్లో జాగ్రత్త అవసరం. దూరదృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
డా.ప్రతిభ