జ్యోతిష్యం.. జీవన సమస్యలు - పరిష్కార మంత్రాలు

By ramya neerukondaFirst Published Sep 14, 2018, 3:26 PM IST
Highlights

అన్ని పనులు అనుకున్న సమయంలో సజావుగా సాగుతూ ఉంటాయి . నిరంతరం భగవంతునితో సన్నిహితంగా ఉండడం అంటేఅర్థం ఆయన్ని తలుచుకుంటూ ఉండాలని.

మననాత్‌ త్రాయతే ఇతి మంత్రం. అంటే నిరంతరం వేరే ఏవిధమైన ఆలోచనలు రాకుండా మంత్రం చేసుకుంటూ ఉండాలని అర్థం. ఎప్పుడూ భగవంతునితో మాత్రమే ఉంటేనే ఏ రకమైన ఆటంకాలు లేకుండా అన్ని పనులు అనుకున్న సమయంలో సజావుగా సాగుతూ ఉంటాయి . నిరంతరం భగవంతునితో సన్నిహితంగా ఉండడం అంటేఅర్థం ఆయన్ని తలుచుకుంటూ ఉండాలని. ఇప్పుడు ప్రస్తుతం మనకు చెప్పుకునే మంత్రాలు ఎవరికి ఏ రకమైన లోపాలు ఉన్నాయో వాటి ని నివారణ చర్యలకు నిరంతరం చేసుకుంటూ ఉండవచ్చు. నిరంతరం అంటే ఉదయం లేచింది మొదలు, మంచినీళ్ళు, టీ , కాఫీలు త్రాగే సందర్భంలో, టి ఫిన్‌, భోజనం చేసే సమయంలో, టీ .వి చూస్తున్న సందర్భంలో, వాకింగ్‌ చేస్తున్న సందర్భంలో అంటే చెప్పులు వేసుకున్న కూడా, చివరికి నిద్రకు ఉపక్రమించే సమయంలో కూడా ఈ మంత్రాలు చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే వేరే ఏ ఆలోచనలను లేకుండా ఎప్పుడూ దైవంతో కనెక్షన్‌ ఉన్నవారం అవుతారు. ఆ కనెక్షన్‌ మాత్రమే ఎప్పుడూ చైతన్యాన్ని ఇస్తూ వ్యక్తిని శక్తిగా మార్చి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి వీలవుతుంది. అప్పుడే వారి వారి లోపాలను నివారించుకో గలుగుతారు.

ప్రస్తుత కాలంలో విద్యార్థుల భవిష్యత్తు వారు వ్రాసే పోటీ పరీక్షలపై ఆధారపడి ఉంటుంది. ఆ పోటీ  పరీక్షలు రాయడానికి వారు చదువుకున్నది ఆ రెండుమూడు గంటల సమయంలో వారికి స్ఫురణకు రావాల్సి ఉంటుంది. అదే అన్నికన్నా ప్రధానమైన అంశం. వారు ఎన్నిరోజులనుంచి కష్టపడి చదువుతున్నారనే విషయం ముఖ్యం కాదు. వారు తమకు తెలిసిన విషయాన్ని సరియైన సమయంలో వినియోగించుకోగలుగుతున్నారా లేదా అనేదే ముఖ్యం. ఆ స్ఫురణశక్తి సరియైన సమయంలో సరియైన విధంగా ఉపయోగపడాలంటే శ్రీ హయగ్రీవాయ నమః అనే నామ స్మరణం నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

కొంతమంది పిల్లలకు ఎంత వయస్సు వచ్చినా వారు స్పష్టంగా మ్లాడలేరు. వాగ్దోషాలు ఉంటాయి . ఆ దోష నివారణకు

అశేష వాగ్జాడ్య మలాపహారిణీ నవం నవం స్పష్ట సువాక్‌ ప్రదాయినీ

మమైహి జిహ్వాగ్ర సురంగ నర్తకీ భవ ప్రసన్నా వదనేచ మే శ్రీః

అనే జపం వల్ల వాక్కుకుండే జడత్వం పోయి చైతన్యం సిద్ధిస్తుంది.

త్వరగా పనులు పూర్తి కావడానికి శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయవలసిన జపాలు కూడా ఉంటాయి . ముఖ్యంగా వ్యాపారస్తులకు తమ తమ వ్యాపారాల్లో ఇబ్బందులు రాకుండా ఉండడానికి తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం పొందడానికి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే జపం నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

అదేవిధంగా ఉద్యోగంకోసం, ఉద్యోగంలో లోపాలు రాకుండా ఉండడం కోసం మరింత గౌరవం పెరగడం కోసం  శ్రీ రాజమాతంగ్యై నమః అనే జపం చేస్తూ ఉండాలి.

పుణ్యబలం పెరచుకుంటేనే ఏ కార్యక్రమాన్నైనా నిర్వహించే శక్తి సాధ్యం అవుతుంది. అందువల్ల పుణ్యం పెంచుకునేందుకు నిరంతరం చేయాల్సిన జపం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ.

ఆరోగ్యం ఇబ్బంది కలిగినప్పుడు ఆ యా శరీర భాగాలను స్పర్శిస్తూ క్రీం అచ్యుతానంత గోవింద అనే జపం చేస్తూ ఉండడం వల్ల మేలు కలుగుతుంది.

డా.ప్రతిభ

click me!