ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఒత్తిడితో సౌకర్యాలు వస్తాయి. ఆశతో జీవిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు. ఆహారంలో సమయపాలన అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అనారోగ్య సమస్యలు వస్తాయి. విద్యార్థులకు ఒత్తిడి ఏర్పడుతుంది. ఆహారంలో జాగ్రత్త వహించాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అన్యుల సహాయ సహకారాలు అందుతాయి. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. పరామర్శలు అనుకూలిస్తాయి. దగ్గరి ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సమయం వృధా అవుతుంది. శ్రీరామజయరామజయజయరామరామజపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వాగ్దానాలు నెరవేరుట కష్టం. మధ్యవర్తిత్వాలు పనికిరావు. నిల్వ ధనాన్ని కోల్పోయే సూచన. కుటుంబ సభ్యులతో జాగ్రత్త అవసరం. తోటి వారితో అనుకూలత ఏర్పరచుకోవాలి. ధన సంపాదనకు ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ప్రయత్నిస్తారు. ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. చిత్త చాంచల్యం ఎక్కువ. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకుటాంరు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ప్రయత్నలోపం ఉండదు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. శత్రువులపై భయం ఉంటుంది. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. అనవసర ఆలోచనలు ఉంటాయి. సుఖం కోసం ఆలోచిస్తారు. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : దురాశ ఉంటుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. సమిష్టి ఆదాయాలు వస్తాయి. కళానైపుణ్యం పెరుగుతుంది. ఊహించని ఆదాయం వస్తుంది. ఇతరులపై ఆధారపడతారు. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. సంతృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఉద్యోగంలో ఆటంకాలు ఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. తోటి ఉద్యోగులతో జాగ్రత్త అవసరం. కీర్తికోసం ఆరాట పడతారు. గౌరవ హాని జరిగే సూచన. ఋణాల ఆలోచనలు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విదేశీ వ్యవహారాలపై ఆలోచన ఉంటుంది. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. దూరదృష్టి అధికంగా ఉంటుంది. పరిశోధనలపై దృష్టి ఉంటుంది. విద్యార్థులకు కష్టకాలం. పనులలో అలసత్వం ఉంటుంది. కాలం వృథా అవుతుంది. శ్రీరామజయరామ జయజయరామరామ జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శ్రమ, కాలం, ధనం వృథా అవుతుంది. అనవసర ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు ఉంటాయి. శ్రమలేని సంపాదనపై ఆశ ఉంటుంది. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఉంటుంది. భాగస్వాములు జాగ్రత్త అవసరం. నూతన పరిచయాల్లో అసౌకర్యం ఏర్పడుతుంది. పదిమందిలో గౌరవం కోసం ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శతృవులపై శ్రమతో గెలుస్తారు. పోటీ ల్లో ఒత్తిడితో విజయం సాధిస్తారు. ఋణబాధలు తీరుతాయి. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : మానసిక ఒత్తిడి అధికం. సంతాన సమస్యలు ఇబ్బంది పెడతాయి. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. సృజనాత్మకతను కోల్పోతారు. కళలపై ఆసక్తి తగ్గుతుంది. అనుకున్న పనులు నెరవేరవు. చిత్త చాంచల్యం ఉంటుంది. శ్రమ, కాలం, ధనం, వృథా అవుతాయి. శ్రీరామ జయరామజయజయరామరామ జపం మంచిది.
డా.ఎస్ ప్రతిభ