యోగాసనాలు - జ్యోతిర్వైద్యం

By ramya neerukondaFirst Published 12, Sep 2018, 3:49 PM IST
Highlights

శరీరంలో ఏ కీళ్ళు కదలాలో ఆ కీళ్ళు సునాయాసంగా కదులుతాయి. యోగాసనాలు, ప్రాణాయామం చేయడం వలన శరీరం మనస్సు రెండూ విశ్రాంతిని పొందుతాయి. నిద్రలేచేసరికి శరీరం నూతన ఉత్తేజంతో కొత్త పనులు చేయడానికి సిద్ధపడుతుంది.

యోగాసనాలు వేయటం ద్వారా శరీరంలో అనవసరమైన ప్రదేశాలలో కొవ్వులాటి ంది పెరగకుండా ఎంజైములు హార్మోన్లు సక్రమంగా విడుదల అయ్యి జీవనక్రియలు సంతులనంగా జరిగే అవకాశం ఉంటుంది. యోగాసనాలు వేయడం వలన శరీరంలోని కండరాలు అనుకూలంగా ఉంటాయి . శరీరంలో ఏ కీళ్ళు కదలాలో ఆ కీళ్ళు సునాయాసంగా కదులుతాయి. యోగాసనాలు, ప్రాణాయామం చేయడం వలన శరీరం మనస్సు రెండూ విశ్రాంతిని పొందుతాయి. నిద్రలేచేసరికి శరీరం నూతన ఉత్తేజంతో కొత్త పనులు చేయడానికి సిద్ధపడుతుంది.

''రోగానికి ముఖ్య కారణం శరీరంలో మలినాలు పేర్కొని పోవడమే''

''యోగచికిత్స యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనస్సుకు శరీరానికి తగిన సమన్వయం కుదర్చటం. అందుకే పతంజలిచే ఆసన, ప్రాణాయామాలు నిర్దేశింపబడ్డాయి. అంతేగాక ఆయుర్వేదంలో శరీరంలోని వాత, పిత్త, కఫాల సమత్వమే ఆరోగ్యస్థితి అని అందుకు భిన్నమైనది రోగస్థితి అని నిర్వచించబడినది. రోగ ఉపశమునకు చేయవలసిన చర్యల సముదాయం చికిత్స అంారు.

మానవ దేహంలోని వాత, పిత్త, కఫ దోషాల అసంతులనమే అనారోగ్యానికి మూల కారణం. ఈ త్రిదోష సంతులనం పొందినవాడే సంపూర్ణ ఆరోగ్యవంతుడు, మంచి జీర్ణశక్తి కలిగినవాడే ఆరోగ్యవంతుడు. జఠరాగ్ని సరిగా ఉండి, ధాతుపుష్టి ఉండాలి, ఎప్పికప్పుడు మలినాలు (వాయు, జల, ఘన రూపంలో) బహిష్కరింపబడాలి. శరీరంలో మలినాలు పేర్కొనరాదు. అంతేకాదు, ఆత్మ, మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ ప్రసన్నంగా ఉండాలి. ఇదే ఆరోగ్యమంటే.

జపం, ధ్యానం, ప్రాణాయామం మొదలైనవి చేయడానికి ఏవిధంగా కూర్చుంటే వీలుగా ఉంటుందో దానినే ఆసనం, పీట అని కూడా అంారు. ఈ ఆసనంపై తల మెడ వెన్నుపూస నిరుగా ఉంచి కూర్చోవాలి. దాని వలన ష్‌చక్రాలలో త్వరగా చలనం కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. ఇలా 3 గంటలసేపు కూర్చోవడం వలన ఆసనసిద్ధి కలుగుతుంది. వ్యక్తికి ధైర్యం, ఆరోగ్యం కలుగుతాయి. శరీరం తేలిక పడుతుంది. ఏ పని చేసినా ఆనందంగా చేస్తాడు. ఏ పనిలోను వ్యతిరేకత ఉండదు.

ఈ ఆసనాలు రెండు రకాలు. 1. సుఖాసనం, 2. యోగాసనం.

సుఖాసనం అంటే ధ్యానం, జపం మొదలైనవి చేసుకోవడానికి ఉపయోగపడే ఆసనం. ఇందులో కూర్చుంటే సుఖంగా ఉండి యోగాసనాలు అనుకూలంగా చేసుకోవచ్చు. 4 రకాల ఆసనాలు ఉంటాయి . 1. సుఖాసనం, 2. సిద్ధాసనం, 3. పద్మాసనం, 4. స్వస్తికాసనం.

మొత్తం 84 లక్షల యోగాసనాలు చెప్పి, అందులో 32 ఆసనాలు చాలా ముఖ్యమైనవని  అన్నారు. కాని యోగశాస్త్రాలు మాత్రం 8 ఆసనాలు ముఖ్యమైన ఆసనాలుగా చెప్తారు. అవి 1.గోముఖాసనం, 2.వీరాసనం, 3.సింహాసనం, 4.భద్రాసనం, 5.ముక్తాసనం, 6.స్వస్తికాసనం, 7.పద్మాసనం, 8.మయూరాసనం.

ఈ కాలాల్లో ఆసనాలు వేయడం తప్పనిసరి. వర్షాకాలం, చలికాలాల్లో శరీరం ముడుచుకోయి కండరాలు గ్టిపడతాయి. ఏ పని చేయడానికి వీలుగా ఉండదు. కాబ్టి ఉదయాన్నే ఆసనాలు వేసుకోవడం వల్ల అన్ని రాశులవారు అన్ని రకాల సమస్యలనుంచి బయట పడవచ్చు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మానసిక ఆరోగ్యం ఉంటుంది. మానసిక శారీరక ఆరోగ్యాలు బావుంటేనే ఏ పనినైనా చేయగలరు. ఆ ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకునే విధానమే యోగ - జ్యోతిర్వైద్యం.

డా.ఎస్ ప్రతిభ

Last Updated 19, Sep 2018, 9:24 AM IST