11జూన్ 2019 మంగళవారం రాశిఫలాలు

By telugu teamFirst Published Jun 11, 2019, 7:06 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వాక్‌దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మాట విలువ పెంచుకునే అవసరం. ఉద్యోగస్తులకు మార్పులు చోటు చేసుకుంటాయి. శ్రమాధిక్యం ఉంటుంది. ఋణబాధలు తీర్చుకునే సమయం. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. అనారోగ్యం వల్ల ఇబ్బందులు. ఓం నమశ్శివాయ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రణాళికలకు అనుగుణంగా రూపకల్పన చేస్తారు. మానసిక ఒత్తిడి తగ్గించుకునే సమయం. సృజనాత్మకత వైపు ఆలోచన ఉంటుంది. సంతానం వల్ల కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. విశ్రాంతి లభించదు. అనసవర ఖర్చులు ఉంటాయి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహారంలో సమయ పాలన మంచిది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శ్రీమాత్రేనమః జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అన్ని రకాలలాభాలు వచ్చినా ఆశించిన సంతోషం ఉండదు. మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. పనులలో జాప్యం ఉండే సూచనలు ఉన్నాయి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. గెస్ట్‌ హౌసెస్‌ ఉండే సూచనలు. వాక్‌దానాలు నెరవేర్చే సూచనలు కనబడుతున్నాయి. ఆర్థిక నిల్వలపై దృష్టి పెడతారు. ఆర్థికావసరాలను తీర్చుకునే ప్రయత్నం. ఓం నమశ్శివాయ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  ఉన్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. పరిశోధనల వల్ల కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. చిన్న చిన్న పనులకే శరీరం అలసిపోతుంది. శారీరక శ్రమకు ఊహించలేరు. ప్రణాళికలకు అనుగుణంగా కార్యరూపం దాలుస్తాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. కష్టకాలం వచ్చే సూచనలు. పరామర్శలు చేస్తారు.వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు చేసే సూచనలు. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సామాజిక అనుబంధాలు వృద్ధి చెందుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం. నూతన పరిచయాల వల్ల ఒత్తిడులు ఏర్పడతాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం ఏర్పడుతుంది. స్త్రీలద్వారా ఆదాయం వచ్చే సూచనలు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది.  గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ఋణ సంబంధ ఆలోచనలు తీరుతాయి. అధికారులతో కొంత అప్రమత్తత అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తలు. నెమ్మదిగా పనులు పూర్తి చేసుకుంటారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : క్రియేటివిటీ తగ్గుతుంది. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. తమకు అవసరం లేని పనులు పెరుగుతాయి. దూర ప్రయాణాలపై ఆలోచనలు పెరుగుతుంది. పరిశోధనలపై ఆసక్తి పెంచుకుంటారు. సంతృప్తితో కాలం గడుపుతారు. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆహారంలో సమయపాలన అవసరం. గృహ సంబంధ బాధలు తీరుతాయి. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అనుకోని ఇబ్బందులు వస్తాయి. ఊహించని ఇబ్బందులు వస్తాయి. శ్రమలేని ఆదాయంపై దృష్టి పెడతారు. పరామర్శలు ఉంటాయి. ఓం నమశ్శివాయ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడి అధికం అవుతుంది. ఎక్కువ శ్రమ తక్కువ లాభాలు వచ్చే సూచనలు. సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయస్తులో స్నేహానుబంధాలు పెంచుకుంటారు. పెట్టుబడులు విస్తరిస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!