10జూన్ 2019 సోమవారం రాశిఫలాలు

By telugu team  |  First Published Jun 10, 2019, 6:44 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) :  మాటల వల్ల ఇబ్బందులు వస్తాయి. మాటల్లో జాగ్రత్త అవసరం. నిల్వధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. కిం సంబంధ లోపాలకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) :శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. తొందరగా నీరస పడిపోతారు.పనుల్లో నిరాశ నిస్పృహలు ఉంటాయి. మానసికంగా కూడా కృంగిపోతారు. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యసాధన చేయాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనవసర ఖర్చులు చేస్తారు. వ్యతిరేక భావన పెరుగుతుంది. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకై ప్రయత్నిస్తారు. పరాధీనత ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికమౌతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఇతరులపై ఆధారపడతారు. కళానైపుణ్యం తగ్గుతుంది. సమిష్టి ఆశయాలు పూర్తిచేయాలనే ఆలోచన ఉంటుంది. సమిష్టి ఆదాయలకోసం ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అధికారులతో జాగ్రత్త అవసరం. చేసే పనిలో నిరాశ, నిస్పృహలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అసౌకర్యం.  ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. కీర్తి ప్రతిష్టలు, పరువుకోసం పనిచేస్తారు. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :   ఆధ్యాత్మిక యాత్రలకై ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలవైపు దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. దూరదృష్టి పెరుగుతుంది.  సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) :ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. జాగ్రత్త అవసరం. చెడు మార్గాల ద్వారా ఆదాయ సంపాదనకై ప్రయత్నం చేస్తారు. వైద్యశాలలసందర్శనం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సామాజిక అనుబంధాల్లో నిరాశ ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. స్నేహితులతో జాగ్రత్త అవసరం. భాగస్వాములతో ఆచి, తూచి వ్యవహరించాలి. పలుకుబడికోసం ఆరాటం పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పోటీల్లో గెలుపుకోసం ప్రయత్నిస్తారు. విఫలమైనా ధైర్యాన్ని కోల్పోరాదు.  శత్రువులపై విజయం కోసం ఆరాటపడతారు. ఋణాలపై దృష్టి ఉంటుంది. రోగనిరోధకశక్తి పెంచుకోవాలి. సేవకులు అనుకూలంగా ఉంటారు. ఔషధ సేవనం తప్పనిసరి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చికాకు పడతారు. సంతానం వల్ల సమస్యలు ఎక్కువౌతాయి. సృజనాత్మకతను కోల్పోతారు. కళలపై ఆసక్తి తగ్గుతుంది. పనుల్లో ఆసక్తి లోపిస్తుంది. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తల్లితో సౌఖ్య లోపం ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త అవసరం. అనారోగ్య భావన ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ, క్రీం అచ్యుతానంత గోవింద జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : బయివారి సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. ప్రసార, ప్రచార సాధనాల్లో అనుకూలత ఉంటుంది. పరామర్శలు చేస్తారు. చిత్త చాంచల్యం అధికం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!