ఈ వారం( నవంబర్ 23నుంచి నవంబర్ 29 వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి

By ramya neerukonda  |  First Published Nov 23, 2018, 9:59 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : కొత్త వార్తలు అందుతాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. ఊహించని ప్రయోజనాలుటాంయి. ప్రయాణాలకు అవకాశం. సౌకర్యాల వల్ల సంతోషం. ఆహార విహారాదులపై దృష్టి ఉంటుది. సహకారం లభిస్తుంది. గౌరవ లోపాలకు అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. గృహ, వాహన విషయాలు ఒత్తిడి ఉండవచ్చు. ఒత్తిడితో ఆలోచనలు పూర్తిచేస్తారు. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. సంతానం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వాగ్దానాల వల్ల ఇ్బంది ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు వచ్చే సూచనలు. సంప్రదింపుల వల్ల ఒత్తిడి. శ్రమ, కాలం ధనం వృథా కాకుండా చూసుకోవాలి. భాగస్వాములతో అనుకూలత ఉంటుంది. ఆహార విహారాదులపై దృష్టి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఒత్తిడితో పోటీల్లో విజయం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. శారీరక ఒత్తిడి ఏర్పడుతుంది. ఓం నమఃశ్శివాయ జపం చేసుకోవడం మంచిది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఆత్మ విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు.  కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. పనుల్లో జాగ్రత్త అవసరం. వాక్‌ చాతుర్యం పెంచుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఉంటుంది.  భాగస్వాములతో అననుకూలత. వ్యాపారస్తులు జాగ్రత్త పడడం మంచిది. నూతన పరిచయాల వల్ల ఇబ్బందులు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతానం వల్ల సంతోషం. వ్యతిరేక ప్రభావాలపై విజయం ఉంటుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వ్యాపారస్తులకు అనుకూలం. ప్రయాణాల్లో సంతోషం ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆలోచనల్లో చిత్త చాంచల్యం ఉంటుంది. అన్ని పనుల్లో పోటీలు ఒత్తిడులు ఉంటాయి. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతోపని చేయాలి. సృజనాత్మకత పెరుగుతుంది. సంతానం వల్ల సంతోషం.  మాటల్లో నిరాశ, నిస్పృహలు ఉంటాయి.విద్యార్థులకు అనుకూల సమయం. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అన్ని పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రయోజనాలకోసం ప్రయత్నిస్తారు.  నూతన పరిచయాల వల్ల సమస్యలు వచ్చే అవకాశం. విందు భోజనాల్లో పాల్గొటాంరు. సౌకర్యాల వల్ల సంతోషం ఏర్పడుతుంది. విహార యాత్రలపై దృష్టి పెడతారు. వ్యతిరేకత ప్రభావాలు ఉంటాయి. శుభవార్తలు వింరు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు కోసం ఆరాటపడతారు. తొందరపాటు పనికిరాదు. చేసే పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీమాత్రే నమః జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉంటుంది. పనుల్లో పోటీలు ఎదురైనా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. అధికారులతో అనుకూలతలు ఏర్పడతాయి. పెద్దలతో సంప్రదింపులు ఉంటాయి. భాగస్వాముల సహకారం లభిస్తుంది. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. శ్రమతో పనులు సాధిస్తారు. లాభాలు కోల్పోయే సూచనలు. విశ్రాంతిలోపం ఉంటుంది. మాటలవల్ల గుర్తింపు పెరుగుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రమతో పనులు పూర్తిచేస్తారు. దూర ప్రయణాలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పనులపై దృష్టి పెడతారు. సంతోషకర వాతావరణం. లాభాలపై దృష్టి ఉంటుంది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విద్యార్థులకు ఒత్తిడి ఉంటుంది. అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు. వ్యాపార విషయాల్లో శ్రమతో పాటు విజయాన్ని సాధిస్తారు.  ఆర్థికాంశాల్లో ఒత్తిడి ఉంటుంది. ఉన్నత విద్యలపై దృష్టి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తారు. ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. విందువినోదాలకోసం ఖర్చు చేస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. సహకార లోపాలకు అవకాశం ఉంటుంది. అనుకోని ఇబ్బందులు వుటాంయి. ఆధ్యాత్మిక ఖర్చులకు అవకాశం ఉంటుంది. దాన ధర్మాల వల్ల మేలు కలుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది. అనుకోని సంఘటనలు ఇబ్బందికి గురి చేస్తాయి. పెట్టుబడులపై దృష్టి ఉంటుంది. మాటల్లో నిరాశ తప్పదు. కీర్తి ప్రతిష్టల్లు ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీదత్తశ్శరణంమమజపంమంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : చేసే పనుల్లో పోటీలు ఉంటాయి. ఒత్తిడి ఇబ్బంది తప్పకపోవచ్చు. భాగస్వామ్య వ్యవహారాల్లో శ్రమ ఒత్తిడి ఉంటాయి. చికాకులు వచ్చే సూచనలు. సంప్రదింపులకు అవకాశం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పరామర్శలకు అవకాశం. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అనారోగ్య సూచనలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆలోచనల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. సంతానంతో జాగ్రత్తగా ఉండాలి. నూతన నిర్ణయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. తొందరపాటు పనికిరాదు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉన్నా గుర్తింపు లభిస్తుంది. శ్రమాధిక్యం ఉంటుంది. సామాజిక గౌరవాన్ని పెంచుకుటాంరు. అనవసర ఖర్చులు తప్పక పోవచ్చు. కాలం, ధనంకోల్పోయే సూచనలు. భాగస్వాములతోజాగ్రత్త అవసరం. సంతోషమైన సమయం. జపం మేలు చేస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. పెట్టుబడులు పెడతారు. అనుకున్న పనులు సాధించే దిశగా ప్రయాణిస్తారు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే అవకాశం. భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. లాభాల సంతృప్తి ఉండకపోవచ్చు. అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు. ఉన్నత కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. స్నేహానుబంధాలు విస్తారిస్తాయి. జపంమేలు.

డా.ఎస్.ప్రతిభ

మరిన్ని సంబంధిత వార్తలు

ఏ రాశివారు ఏ దేవుడిని పూజించాలి..?

అరచేతిలో ఎలాంటి వలయాలు ఉంటే ప్రయోజనం

click me!