అరచేతిలో ఎలాంటి వలయాలు ఉంటే ప్రయోజనం
ఈ వలయం చాలా గొప్ప అతీంద్రియ శక్తిగల మహాత్ములకు మాత్రమే ఉంటుంది. నడిచేదైవమా, నడిచే శాస్త్రమా అన్నంతి గొప్ప గొప్ప వ్యక్తులకు మాత్రమే ఉంటుంది.
వలయాలను అర్ధవృత్తాలని, అర్ధవలయాలని, అర్ధగోళాలని, అర్ధముద్రలని, మండల రేఖలని వేరు వేరు పేర్లతో పిలుస్తారు. ఈ వలయాలు ఆయా గ్రహస్థానాల మధ్యభాగాలలో అడ్డుగా, అర్ధవలయంగా చుట్టుకొని ఉంటాయి ఇవి ఆ గ్రహకారకత్వాలను విభజిస్తాయి కాబ్టి మంచివి కావని కొందరు, కాదు ఇవి శుభఫలితాలనిస్తాయని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కానీ ఇందులో కూడా మంచిని చేసేవి చెడును చేసేవి కూడా ఉంటాయి. పైగా గ్రహ పర్వతాలలో ఉండే స్వరూపాలనుబ్టి ఇవి ఇచ్చే ఫలితాలు మారుతూ ఉంటాయి.
గురు వలయం, చంద్రవలయం ఈ రెండు వలయాలు చూడానికి వేరే రకంగా కనబడిన గురువలయం కేవలం చూపుడు వేలు వైపు గల దగ్గరి ప్రాంతం ఒక అర్ధ చంద్రుడు చుట్టుకొని ఉన్నాడా అన్నట్లుగా చేతి వెలుపలనుండి ప్రారంభమై చూపుడు మధ్య వేలు మధ్య ప్రాంతంలో ముగుస్తుంది. కొందరు ఇది అర్ధవలయమే కదా అంటారు. సమాధానంగా శాస్త్రం మిగిలిన అర్ధభాగం ముంజేయి వైపు ఉన్నట్లు ఊహించుకోమని చెప్పింది. ఇవి సంఖ్యలో పూర్వజన్మ కర్మననుసరించి 3 వరకు ఉండవచ్చు. ఇవి వాక్శుద్ధిని, వాక్సిద్ధిని, ఉపాసనను అతీంద్రియ శక్తికి సంబంధించిన 1,2 శాస్త్రాలలో పూర్తి పట్టును ఇస్తాయి. నోటి నుండి వచ్చిన మంచి మాట ఫలితమిచ్చి తీరుతుంది. ఈ రేఖలు పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులకు పీఠాధిపతులకు, మఠాధిపతులకు, మత బోధకులకు, దివ్యశాస్త్ర బోధకులకు ఉంటాయి.
2. చంద్రవలయం చంద్రునివైపుగల కంకణ రేఖలలో ప్రారంభమై చంద్ర పర్వతంలోనే (అనగా మొది కుజస్థానం కింద) పరిసమాప్తమౌతుంది. చంద్రునికి ఏ వేలు ప్రాధాన్యత లేదు కాబ్టి ఈ వలయం చాలా గొప్ప అతీంద్రియ శక్తిగల మహాత్ములకు మాత్రమె ప్రబోధకులకు ఉంటుంది. నడిచేదైవమా, నడిచే శాస్త్రమా అన్నంతి గొప్ప గొప్ప వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. వీరు గొప్ప ఉపాసన శక్తిగలవారు. వీరు నడిచే ప్రాంతాలు భవిష్యత్తులో పవిత్ర క్షేత్రాలుగా తీర్థాలుగా ప్రఖ్యాతి చెందుతాయి.
శుక్ర వలయం : ఇది కూడా గొప్ప వలయాల్లో శుభ వలయాల్లో ఒకి. నిజానికి వలయాలను గూర్చి చెపుతున్నప్పుడు ఆయా వేళ్ళను గ్రహ ప్రాంతాలను శుక్ర వలయం మాత్రం శుక్ర పీఠం కాకుంఠా హృదయ రేఖపై గల ఒకికి మించిన వేళ్ళనో అన్ని వేళ్లనో అర్ధచంద్రాకారంలో చుట్టుకొని ఉంటుంది. ఇది సంఖ్యలో 2,3 వరకు ఉండవచ్చు. (కాని పొరపాటున గూడా హృదయరేఖను శుక్రవలయంగా భావించరాదు) ఇది గురు, చంద్ర వలయాలవలె కాకుండా సకల భోగ, భాగ్యాలను మాత్రమే ఇస్తుంది. కాని ఈ వలయాలలో ఏ ఒక్క వలయం తెగి ఉన్నా ఫలితాలు శూన్యం.
శని వలయం ఇది శనిపర్వత భాగంలో ఉంటుంది. ఈ వలయం అశుభ వలయమని చెప్తారు. ఇది ఉంటే శ్రమ, కాలం, ధనం తమకు తెలియకుండానే వాటిని కోల్పోతారు. బద్ధకస్తులుగా పెరుగుతారు. వ్యర్థంగా కాలయాపన చేస్తారు. అన్నిటి కీ కష్టాలే అనుభవిస్తారు.
రవి వలయం కొందరు చెప్పిన విషయంలో వీరు ఏ పని లేనివారుగా, పనిలో ఆరంభశూరులని, ఏ పేరు ప్రతిష్టలు వీరికి రావని చెప్తారు.
బుధవలయం : వీరికి విద్యలో రాణింపు, గుర్తింపు ఉండదు. చదువుపట్ల అయిష్టంగా ఉంటారు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండవలెను. వ్యాపారం దివాలా తీసే అవకాశం ఉంటుంది.
కాబ్టి ఈ వలయాలను జాగ్రత్తగా చూడవలెను. ఇవి అందరికీ అన్నీ ఉంటాయని కాదు. కొందరికి కొన్ని ఉంటాయి. చేతిలోని రేఖలను చూసుకుంటూ ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటి ని తొలగించుకుంటూ జాగ్రత్త పడడం తప్పనిసరి.
డా.ఎస్.ప్రతిభ