ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు ఉంటా యి. దూర ప్రయాణాలకు అవకాశం. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలుటా ంయి. పరామర్శలకు అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు ఏర్పడతాయి. గుర్తింపు లభిస్తుంది. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అధికారులతో అనుకూలత ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో చికాకులు ఉంటా యి. చిత్త చాంచల్యం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. లాభాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. అనుకోని సమస్యలు వస్తాయి. అన్ని పనుల్లో జాగ్రత్తగా మెలగాలి. ఆధ్యాత్మిక ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఒత్తిడులు ఉంటా యి. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సంతృప్తి తక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదులపై దృష్టి ఉంటుంది. అధికారిక వ్యవహారాలుటా ంయి. పరిచయాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార వ్యవహారాల్లో నూతన పోకడలుటా ంయి. సౌకర్యాలను పెంచుకుటా ంరు. ఆశించిన ఫలితాలు అందకపోవచ్చు. ఖర్చులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య లోపాలకు సూచన. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి ఉండాలి. శ్రీ రామ జయరామ జయజయ రామరామ మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకోని ప్రమాదాలకు అవకాశం. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. దానధర్మాలకై ఖర్చు చేయాలి. దూర ప్రయాణాలపై దృష్ట్టి ఉంటుంది. చేసే అన్ని పనుల్లో సంతృప్తి తక్కువగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. అధికారిక వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. భాగస్వామ్యాలు అనుకూలిస్తాయి. ఊహించని ఇబ్బందులు ఉంటా యి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యతిరేకతలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఉన్నాయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. అధికారిక వ్యవహారాలపై శ్రమ ఉన్నా స్థాయి పెరుగుతుంది. పోటీ రంగంలో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వ్యతిరేకతలపై విజయం ఉంటుంది. పోటీ ల్లో గెలుపు సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరగవచ్చు. ఆహార విహారాదుల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు అనుకూల సమయం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆలోచనల్లో తొందరపాటు పనికి రాదు. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సృజనాత్మకతను కోల్పోతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంతాన సమస్యలుటా యి. పోటీ ల్లో గెలుపు సాధిస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. భాగస్వామ్యాలపై ప్రత్యేకదృష్టి ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సౌకర్యాల వల్ల శ్రమ పెరుగుతుంది. వ్యతిరేక ప్రభావాలుటా ంయి. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సౌకర్యాల వల్లల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆలోచనల్లో సృజనాత్మకత పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో ఆర్థిక విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. వాగ్దానాల విషయంలో జాగ్రత్త అవసరం. నిల్వ ధనాన్ని కోల్పోయే సూచనలు. వ్యాపార వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. పోటీ ల్లో గెలుపు సాధిస్తారు. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. విద్యార్థులు తక్కువ శ్రమతో ఫలితాల సాధన ఉంటుంది. సౌకర్యాల వల్ల సంతోషం ఉంటుంది. ఆహార విహారాదులపై దృష్టి ఉంటుంది. బద్ధకం తగ్గించుకోవాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాటల్లో నైరాశ్యధోరణి ఉంటుంది. విశ్రాంతి లభిస్తుంది. వ్యతిరేకతలు ఉన్నా గుర్తింపు లభిస్తుంది. పనుల్లో చికాకు ఏర్పడుతుంది. శ్రీ మాత్రే నమః జపం చేయడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : మాట విషయంలో జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వాలు పనికిరావు. కుటుంబ, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంప్రదింపులు అనుకూలిస్తాయి. సహకారం లభిస్తుంది. పరామర్శలకు అవకాశం ఉంటుంది. పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. గృహ, వాహనాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు విస్తరిస్తాయి. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా మార్పులు ఉంటా యి. లాభాలు ఉంటా యి. ఆధ్యాత్మిక యాత్రలు ఉంటా యి. అనుకోని ఒత్తిడులు ఉంటా యి. వ్యాపారస్తులకు అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెడతారు. అనారగ్య సూచనలు. విశ్రాంతి తీసుకోవడం మంచిది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : నిత్యావసర ఖర్చులు ఉంటా యి. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాలు అనుకూలంగా ఉంటా యి. బాధ్యతలు అధికంగా ఉంటా యి. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాదులు అనుకూలంగా ఉంటా యి. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని ప్రయోజనాలు ఇబ్బందికరంగా ఉంటాయి. లక్ష్యాలను ఆలోచిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
డా.ఎస్.ప్రతిభ