11జనవరి2019 శుక్రవారం రాశిఫలాలు

By ramya neerukondaFirst Published Jan 11, 2019, 7:05 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనవసర ఇబ్బందులు ఉంటాయి. ఊహించని కష్టాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సంప్రదింపుల్లో లోపాలు ఉంటాయి. అనారోగ్య సూచనలు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. క్రయ విక్రయాల్లో లోపాలు ఉంటాయి. జాగ్రత్త అవసరం. శ్రీ దత్తశ్శరణం మమ జపంచేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య అనుబంధాలు విస్తరిస్తాయి. పదిమందిలో గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలత ఏర్పడుతుంది. సామాజిక అభివృద్ధి  ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ దత్తశ్శరణం మమ జపంచేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం ఉంటుంది. శత్రువులపై విజయానికి కష్టపడతారు. ఋణబాధలు పెరిగే సూచన. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం. వృత్తి విద్యలపై ఆసక్తి తగ్గుతుంది. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. పనుల్లో జాగ్రత్తలు. శ్రీ దత్తశ్శరణం మమ జపంచేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మానసిక ప్రశాంతత ఉంటుంది. సంతాన సమస్యలు తీరుతాయి.  సృజనాత్మకత పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. కొంచెం కష్టంతో ఎక్కువ ఫలిత సాధన ఉంటుంది. శ్రీ దత్తశ్శరణం మమ జపంచేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విద్యార్థులకు కష్టకాలం ఉంటుంది. సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. సౌకర్యాల వల్లఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆహారంలో సమయపాలన తప్పనిసరి. అనవసర ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచన. శ్రీ దత్తశ్శరణం మమ జపంచేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పెద్దల సహకారం ద్వారా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. ప్రసార, ప్రచార సాధనాల ద్వారా సంతృప్తి లభిస్తుంది. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలిత సాధన. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ఉంటుంది. శ్రీ దత్తశ్శరణం మమ జపంచేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు పెరుగుతాయి. వాగ్దానాలు నెరవేరుతాయి. మాట విలువ పెరుగుతుంది. దృష్టిదోషాలు పెరిగే సూచన. సంప్రదింపుల్లో అనుకూలత ఉంటుంది. జాగ్రత్త అవసరం. శ్రీ దత్తశ్శరణం మమ జపంచేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శారీరక శ్రమ ఉంటుంది. స్థల మార్పు చేస్తారు. గుర్తింపు అంతగా ఉండదు. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పు అవసరం. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అనారోగ్య సమస్యలు వస్తాయి. శ్రీ దత్తశ్శరణం మమ జపంచేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక ఖర్చులు అధికం. మానసిక ఒత్తిడిఅధికంగా ఉంటుంది. చిత్తచాంచల్యంఅధికం. అనవసర ఖర్చులు ఉంటాయి. శ్రీ దత్తశ్శరణం మమ జపంచేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం. కళాకారులకు అనుకూల సమయం. సమిష్టి ఆశయ సాధన ఉంటుంది. ఆదాయ మార్గాలు అనేకం. కళాకారులకు అనుకూల సమయం. పనుల్లో ఒత్తిడినితగ్గించుకునే ప్రయత్నం అవసరం. శ్రీ దత్తశ్శరణం మమ జపంచేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అధికారులతో ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. రాజకీయ విషయాలపై దృష్టి పెడతారు. కంపెనీల్లో వాలకై ప్రయత్నిస్తారు. సంఘంలో గౌరవం కోసం ఆరాటం. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం.  శ్రీ దత్తశ్శరణం మమ జపంచేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శుభకార్యాల్లో పాల్గొటాంరు. మృష్టాన్నభోజన ప్రాప్తి ఉంటుంది. దూర ప్రయాణౄలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే సంకల్పం. సజ్జన సాంగత్యం ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. శ్రీ దత్తశ్శరణం మమ జపంచేసుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!