వికారినామ సంవత్సరం.. వృషభరాశివారి ఫలితాలు

By ramya NFirst Published Apr 4, 2019, 3:23 PM IST
Highlights

తెలుగు సంవత్సరాదిలో వృషభరాశి ఫలితాలు

వృషభం : (కృత్తిక 2,3,4 పా. రోహిణి, మృగశిర 1,2 పా) : ఆదాయం - 8, వ్యయం - 8; రాజపూజ్యం - 6, అవ - 6;

          ఈ రాశివారికి గురువు గోచార రీత్యా నవంబర్‌ 4 వరకు సప్తమంలోను సంవత్సరాంతంలో అష్టమ సంచారం చేస్తాడు. సామాజిక అనుబంధాలు పెంచుకోవాలనే ప్రయత్నం అధికంగా చేస్తారు. తమకన్నా ఉన్నతులు, గొప్పవారితో పరిచయాలు పెంచుకుటాంరు. పెట్టుబడులు విస్తరించే ప్రయత్నం చేస్తారు. తమ స్టేటస్‌ను పెంచుకునే ప్రయత్నంలో అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు.

సామాజిక అనుబంధాలు, వివాహ అనుబంధాల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. భాగస్వాములతో కొంత కలిసిమెలిసి జాగ్రత్తగా వ్యవహరించాలి. నవంబర్‌ తర్వాత అష్టమ సంచారం కూడా అంత మంచిది కాదు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. పరామర్శలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. శని అష్టమ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది.

ఆరోగ్యవిషయంలో జాగరూకులై ఉండడం మంచిది. జనవరి 2020 తర్వాత శని నవమ సంచారం వలన ఆధ్యాత్మిక ప్రగతి కొంత పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. అధిక శ్రమానంతరం సంతృప్తి లభిస్తుంది. రాహువు ద్వితీయ సంచారం వలన మాటల వల్ల జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి మ్లాడకూడదు. ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నిల్వ ధనాన్ని కోల్పోతారు. అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. కేతువు అష్టమ సంచారం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేరు. నిరాశ, నిస్పృహలు అధికంగా ఉంటాయి. పరామర్శలు చేస్తారు. హాస్పిటల్స్‌ కోసం ఖర్చులు చేస్తారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నందున వీరు మంచిపనులకై ఖర్చులు చేయడంమంచిది. గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఏ విషయంలోనూ తొందరపాటు పనికిరాదు. గణపతి పూజ, శివారాధన, దత్తాత్రేయ పారాయణం మేలు చేస్తాయి.

గృహప్రాప్తి మంత్రం :  చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా, 

ఇల్లు కాకుండా స్థలం కొనుక్కుందామనుకుంటే

స్థల ప్రాప్తి మంత్రం : శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ, త్రివిక్రమాయ నమః,

దాన ధ్యానం : జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఈ జపాలు చేసుకుంటూ ఉండాలి.

డా.ఎస్ ప్రతిభ

ఇతర రాశుల వారి ఫలితాలు

మేషరాశి ఫలితాలు

click me!