జాతకం...బ్యాంక్‌ ఉద్యోగం వస్తుందా? ఎప్పుడు వస్తుంది?

By ramya NFirst Published Apr 4, 2019, 1:59 PM IST
Highlights

మాకు పంపిన కొందరి జాతక వివరాలు ఇలా ఉన్నాయి

1. నరేష్‌

బ్యాంక్‌ ఉద్యోగం వస్తుందా? ఎప్పుడు వస్తుంది?

మీకు ఇప్పుడే మంచి సమయం మొదలైంది.  ఈ సారి ప్రయత్నం చేస్తే తప్పక వస్తుంది. మీరు చెప్పే జపాలు, దానాలు చేసుకుంటూ ఉండాలి. తప్పక వస్తుంది.

దానం : పల్లీలు / నూనె, 2. కందిపప్పు/ దానిమ్మపళ్ళు/ కర్జూరాలు, 3. గోధుమపిండి / గోధుమరవ్వ / చపాతీలు నిరంతం దానాలు చేస్తూ ఉండాలి.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః ; శ్రీరామ జయరామ జయజయ రామరామ జపాలు మంచివి.

పై అంశాలలో ఒక్కో దానిలోంచి ఒక్కొక్కటి తప్పనిసరిగా దానం చేయాలి.

2. సాయి పార్వతి

ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?

ప్రభుత్వ ఉద్యోగ అవకాశం ఉంది. భగవత్‌ ప్రయత్నం చేయండి. తప్పక వస్తుంది. సమయం కూడా ప్రస్తుతం అనుకూలంగా ఉంది.

జపం : శ్రీరాజమాతంగ్యై నమః ; శ్రీరామ జయరామ జయజయ రామరామ జపాలు మంచివి.

దానం : 1. కందిపప్పు/ దానిమ్మపళ్ళు/ కర్జూరాలు, 2. గోధుమపిండి / గోధుమరవ్వ / చపాతీలు, 3.నూనె/ పల్లీలు నిరంతం దానాలు చేస్తూ ఉండాలి.

పై అంశాలలో ఒక్కో దానిలోంచి ఒక్కొక్కటి తప్పనిసరిగా దానం చేయాలి.

3. ప్రవల్లిక

వివాహం ఎప్పుడు అవుతుంది?

మీకు ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉన్నది. వివాహానిక్కటి అనుకూలమైన సమయమే. నిరంతరం జపం, దానాలు చేస్తూ ఉండాలి. 2021 ఏప్రియల్‌ వరకు అనుకూలం. ఏప్రిల్‌ 2021 దాటితే 2022 ఆగస్టు వరకు మళ్ళీ సమయం బాలేదు.

జపం : కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానం : నిమ్మకాయపులిహోర / అలంకరణ వస్తువులు, 2. ఇడ్లీ / వడ దానం చేయాలి.

పై అంశాలలో ఒక్కో దానిలోంచి ఒక్కొక్కటి తప్పనిసరిగా దానం చేయాలి.

4. రవి కుమార్‌

వివాహం ఎప్పుడు అవుతుంది?

మీ జాతకంలో ఆలస్య వివాహం సూచిస్తుంది. అయినా ప్రస్తుతం సమయం బాలేదు. 2021 ఫిబ్రవరి తరువాత మీకు వివాహానిక్కటి అనుకూల సమయం. వివాహం కావడం ఒకటే కాదు. తర్వాత కూడా అనుకూలంగా ఉండడంకోసం  ఇప్పినుంచి నిరంతరం చెప్పే జపాలు, దానాలు చేసుకుంటూ ఉండాలి.

జపం : కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానం : 1. కందిపప్పు/ దానిమ్మపళ్ళు/ కర్జూరాలు, 2. గోధుమపిండి / గోధుమరవ్వ / చపాతీలు, 3. నిమ్మకాయపులిహోర / అలంకరణ వస్తువులు, 4. అన్నదానం / పాలు /పెరుగు, 5. పళ్ళు / విద్యార్థులకు పుస్తకాలు నిరంతరం దానం చేస్తూ ఉండాలి. పై అంశాలలో ఒక్కో దానిలోంచి ఒక్కొక్కటి తప్పనిసరిగా దానం చేయాలి.

5. విజయ్‌ కుమార్‌

మీరు జనన వివరాలు పూర్తిగా పంపలేదు. జనన తేదీ, నెల, సంవత్సరం, జనన సమయం, జన్మించిన ప్రదేశం, జిల్లా అన్ని వివరాలు పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే జాతకం చెప్పడం కుదురుతుంది. దయచేసి సరిచూసుకోండి.

6. వి. పాండు

మీరు పంపిన జననవివరాలు, మీరు చెప్పిన నక్షత్రం సరిపోవడం లేదు. ఒకసారి సరి చూసి పంపండి.

7. గౌతమి

ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది.

మీకు జాతకంలో ఒక స్థాయిలో ఉండే ఉద్యోగం సూచిస్తుంది. హోరా గౌరవం అన్నీ లభిస్తాయి. ప్రస్తుతం సమయం కూడా అనుకూలంగానే ఉన్నది. జపం దానం చేస్తూ దేవునిపై  భారం వేసి ప్రయత్నం చేయాలి. మీరు దానాలు అధికంగా చేయాలి.

జపం : శ్రీరాజమాతంగ్యై నమః ; శ్రీరామ జయరామ జయజయ రామరామ

దానం : 1. అలంకరణ వస్తువులు / నిమ్మకాయ పులిహోర, 2. కందిపప్పు, కర్జూరాలు / దానిమ్మపళ్ళు దానం చేస్తూ ఉండాలి.

పై అంశాలలో ఒక్కో దానిలోంచి ఒక్కొక్కటి తప్పనిసరిగా దానం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ

click me!