వికారి నామ సంవత్సరం.. మిథున రాశివారి ఫలితాలు

By ramya N  |  First Published Apr 4, 2019, 3:38 PM IST

తెలుగు సంవత్సరాదిలో మిథునరాశివారి ఫలితాలు ఇలా ఉన్నాయి


మిథునం : (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు1,2,3 పా) : ఆదాయం -11, వ్యయం -5; రాజపూజ్యం - 2, అవ -2;

          ఈ రాశి వారికి గురువు గోచార రీత్యా నవంబర్‌ 2019 వరకు షష్ఠంలోను నవంబర్‌ తర్వాత సప్తమంలో సంచారం ఉంటుంది. గురువు షష్ఠసంచారం వలన పోటీ ల్లో గెలుపుకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. తన కంటే పెద్దవారితో ఉన్నతులతో పోటీ లు ఎక్కువగా ఉంటాయి. దాని వలన మనస్పర్థలు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక వ్యవహారాలు పూర్తిచేసుకుటాంరు.

Latest Videos

undefined

తదనంతరం సప్తమ సంచారం వలన సామాజిక అనుంబంధాలు అనుకూలిస్తాయి. భాగస్వాములతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అనారోగ్య సూచనలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో తొందరపడకూడదు. శని 2020 జనవరి 24 వరకు ధనుస్సులోను తరువాత తన స్వక్షేత్రమైన మకరంలో సంచరిస్తాడు. శని సప్తమ సంచారం అనాలోచిత పనులు చేస్తారు. 

పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక అనుబంధాలు అంతగా విస్తరించవు. వ్యాపారస్తులు జాగరూకులై ఉండాలి. ఆధ్యాత్మిక యాత్రలకు ప్రాతినిధ్యం వహిస్తారు. మోసపోయే అవకాశాలుటాంయి. స్నేహ సంబంధాలు అంత ఎక్కువగా పెంచుకోకూడదు. బాగస్వాములతో ఒత్తిడులు తప్పవు.

రాహువు మిథునంలో కేతువు ధనుస్సులో సంచారం వలన అన్నీ తమకే కావాలనే ఆశ పెరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. సమయం, కాలం, ధనం అన్నీ వృథా అవుతాయి.  కేతువు వల్ల సామాజిక అనుబంధాల్లో విభేదాలు ఏర్పడే అవకాశం కనబడతుంది. పెట్టుబడులు విస్తరణ తగ్గుతుంది. వీరు దుర్గాస్తోత్ర పారాయణ,  శ్రీరామజయరామ జయజయ రామరామ జపం మంచిది.

గృహప్రాప్తి మంత్రం :  చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా, 

ఇల్లు కాకుండా స్థలం కొనుక్కుందామనుకుంటే

స్థల ప్రాప్తి మంత్రం : శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ, త్రివిక్రమాయ నమః,

దాన ధ్యానం : జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఈ జపాలు చేసుకుంటూ ఉండాలి.

డా.ఎస్.ప్రతిభ

 

ఇతర రాశుల వారి ఫలితాలు

మేషరాశి ఫలితాలు

వృషభరాశి ఫలితాలు

click me!