ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడమెలా..?

By telugu news teamFirst Published Sep 1, 2022, 2:33 PM IST
Highlights

మనం అనుకున్న పనులు కూడా సరిగా జరగవు.  కానీ.. మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉందని మనకు ఎలా తెలుస్తుంది..? కొన్ని సంకేతాల ద్వారా.. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవచ్చట. అవేంటో ఓసారి చూద్దాం...

ఈ ప్రపంచంలో పాజిటివ్, నెగిటివ్ రెండు ఎనర్జీలు ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట అంతా మంచి ఆలోచనలు కలుగుతాయి. అంతా మంచే జరుగుతుంది. ఆ ప్రదేశంలో మనకు ఎక్కువ సేపు ఉండాలని కూడా అనిపిస్తుంది. అదే... నెగిటివ్ ఎనర్జీ ఉంటే... అక్కడ ఎక్కువ సేపు ఉండలేం.  ఏదో తెలియని వెలితి.  ప్రశాంతంగా ఉండలేం.మనం అనుకున్న పనులు కూడా సరిగా జరగవు.  కానీ.. మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉందని మనకు ఎలా తెలుస్తుంది..? కొన్ని సంకేతాల ద్వారా.. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవచ్చట. అవేంటో ఓసారి చూద్దాం...

1.ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని అనుకుంటారు. అయితే.. మనం శుభ్రంగా ఉంచుకున్నా సరే... ఒక్కోసారి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలా దుర్వాసన వస్తోంది అంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. కాబట్టి.. ఆ దుర్వాసన లేకుండా చూసుకోవాలి. లేదంటే... దుర్వాసన దురదృష్టానికి సంకేతమట. దానిని తొలగించుకుంటే మీకు అదృష్టం దక్కుతుంది.

2. మీ ఇంట్లో ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వాదనలు జరుగుతున్నాయి అంటే కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. కాబట్టి... ఆ నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవడానికి ఇంట్లోని సమస్యలను కూర్చొని మాట్లాడుకోవాలి.

3.మనకు రాత్రిపూట నిద్ర రావడం చాలా కామన్. కానీ.. రాత్రి పడుకున్నప్పుడు వచ్చే కలలు పీడ కలలు అయితే మాత్రం వెంటనే ఆలోచించాలి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే... ఇలాంటి  కలలు వస్తూ ఉంటాయట.

4.ఇంట్లో డబ్బు సమస్య ఉండటం చాలా కామన్. కానీ... అలా కాకుండా... డబ్బు సమస్యకు పులిస్టాప్ అనేది పడకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది అంటే... ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థమట.

5.ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే... మనకు వచ్చే ఆలోచనలు కూడా నెగిటివ్ గానే ఉంటాయట. అంటే.... ఏదైనా సమస్య ఉన్నట్లు అలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అలా వస్తున్నాయంటే కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి.

6.ఎక్కువ పని చేసినప్పుడు నీరసంగా  ఉన్నట్లు, ఓపికలేనట్లు అనిపించడం చాలా సహజం. అయితే... ఒక్కోసారి మనం ఎంత కష్టపడకపోయినా నీరసంగా అనిపించడం, ఓపికలేకపోవడం లాంటివి అనిపిస్తూ ఉంటుందంటే... నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే లెక్క.

7.ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య మిస్ కమ్యూనికేషన్ ఎక్కువగా జరుగుతోంది అంటే ఆ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థమట. కాబట్టి... అలా మిస్ కమ్యూనికేషన్ లేకుండా చూసుకోవాలి.

click me!