గణేష్ చతుర్థి 2022: ఈ పూజలతో రాహు, కేతు దోషాలు తొలగించవచ్చు..!

By telugu news teamFirst Published Aug 31, 2022, 9:38 AM IST
Highlights

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు గణేష్ చతుర్థి జరుపుకుంటారు. ఈసారి ఈ పండుగను 31 ఆగష్టు 2022 న జరుపుకుంటున్నారు. మత విశ్వాసాల ప్రకారం, గణేశుడు ఈ తేదీన జన్మించాడు. అందుకే ఈ రోజున వినాయక చవితి జరుపుకుంటారు.

గణేష్ చతుర్థి రోజు నుంచి పది రోజుల పాటు గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు గణేష్ చతుర్థి జరుపుకుంటారు. ఈసారి ఈ పండుగను 31 ఆగష్టు 2022 న జరుపుకుంటున్నారు. మత విశ్వాసాల ప్రకారం, గణేశుడు ఈ తేదీన జన్మించాడు. అందుకే ఈ రోజున వినాయక చవితి జరుపుకుంటారు.

భక్తులు ఈ ప్రత్యేక రోజున జ్ఞానం, శ్రేయస్సు , అదృష్టాన్ని అందించే దేవుడైన గణేశుడిని పూజిస్తారు. పూజ సమయంలో, వారు వినాయకుడికి కుంకుమ, చందనం, యజ్ఞోపవీతం, దుర్వే, లడ్డూలు లేదా బెల్లంతో చేసిన ప్రసాదాలను సమర్పిస్తారు. గణేశ చతుర్థి రోజున వినాయకుని వివిధ రూపాలలో పూజిస్తారు. ఈ పూజలతో రాహు, కేతు దోషాలను కూడా తొలగించవచ్చు.


బుధుడు, కేతువుల శాంతికి నివారణలు

శాస్త్రాల ప్రకారం, శ్రీ గణేశుడికి సింధూరం మాత్రమే ఉంచాలి. బుధ, కేతు గ్రహాల దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు గణేశోత్సవం రోజున చేసే పరిహారాల గురించి తెలుసుకుందాం. బుధగ్రహ పరిహారాలు చేయడం వల్ల కేతువు దోషాలు కూడా తగ్గుతాయి.

గణేశ చతుర్థి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి గణేశుడికి పదకొండు లేదా ఇరవై ఒక్క దుర్వేలు సమర్పించి బుధ దోషం పోవాలని ప్రార్థించండి.
గణేష్ చతుర్థి రోజున పేదలకు  ధాన్యం దానం చేయండి. దీనిని దానం చేయడం వల్ల బుధుడు, కేతువుల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
జాతకంలో బుధుడు అశుభ స్థానంలో ఉంటే, గణేశ చతుర్థి నాడు, గణేశుడికి కుంకుమ, గంధం, యజ్ఞోపవీతం, దుర్వేని సమర్పించి మోదకం, లడ్డూ లేదా బెల్లంతో చేసిన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత ఆర్తి చేయండి.
గణేశ చతుర్థి నాడు, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కోసం ఇంట్లో పసుపు గణపతి విగ్రహాన్ని పూజించండి.
గణేశ చతుర్థి నాడు ఏనుగుకు పచ్చి మేత తినిపించండి. గణేశ ఆలయాన్ని సందర్శించండి. మీ కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించాలి.
గణపతికి స్వచ్ఛమైన నెయ్యి, బెల్లం సమర్పించండి. దీని తర్వాత ఆవుకు నెయ్యి , బెల్లం తినిపించండి. ఈ పరిష్కారం చేయడం వల్ల బుధుడు, కేతువుల వల్ల వచ్చే డబ్బు సంబంధిత సమస్యలు తీరుతాయని నమ్ముతారు.

click me!