న్యూ ఇయర్ లో మిథునరాశి వారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

By ramya neerukondaFirst Published Dec 29, 2018, 3:03 PM IST
Highlights

నూతన సంవత్సరంలో మిథున రాశివారికి ఇలా ఉండబోతోంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వీరికి సప్తమ దశమాధిపతి గురుడు షష్ఠంలో, అష్టమ నవమాధిపతి శని సప్తమంలో, ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు ఉన్నారు. మార్చ్‌ తర్వాత లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు ఉంటారు.

పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శత్రువులపై విజయం సాధించాలనే తపన అధికంగా ఉంటుంది. దానివల్ల సామాజిక అనుబంధాలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. అధికారులతో జాగ్రత్త వహించాలి. తమకంటే పెద్దవారితో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి.

పదిమందిలో పలుకుబడికోసం ఆలోచిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టకూడదు. నూతన పరిచయాలవల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మోసపోయే అవకాశం ఉంటుంది. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా మెలగాలి. జీవిత, వ్యాపార భాగస్వాములతో జాగ్రత్త అవసరం. తొందరపాటు పనికిరాదు. ఒకరిని ఒకరు అర్థంచేసుకొని మెలగాలి. తాము చేసే పనుల్లో అనుకూలతను వెతుక్కునే ప్రయత్నం చేయాలి.

మాటల్లో తొందరపాటు పనికిరాదు. ఎక్కువగా వినడం తక్కువగా మ్లాడడం మంచిది. కుటుంబ, సామాజిక అనుబంధాలు మాటలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఆర్థిక నిల్వలు కోల్పోయే సమయం. అనవసర ఖర్చులు ఉంటాయి. ఇంటికోసం చేసే ప్రయత్నాల్లో జాగ్రత్త అవసరం. మార్చి తర్వాత నుంచి తాము చేసే పనులే తమకు ఇబ్బందిని కలిగిస్తాయి. అనవసర పనుల జోలికి వెళ్ళకూడదు.

ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. వైద్యశాలలు, పరామర్శలు అధికం అవుతాయి. మార్చి తర్వాత నుంచి సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఉంటుంది. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు. భాగస్వాములతో జాగ్రత్త అవసరం.

ఈ రాశివారు శని, గురు, రాహు, కేతువులకు అన్నిగ్రహాలకు పరిహారాలు చేసుకోవడం మంచిది. ప్రతిగ్రహం కూడా ఏదో ఒక రకంగా కొంత ఒత్తిడిని కలిగిస్తూనే ఉంటుంది.

బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామాలు, లేదా వాకింగ్‌ చేయడం తప్పనిసరి. దక్షిణామూర్తి ఆరాధన,  ప్రత్యక్షంగా గురువులను కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం చేయాలి. దుర్గా స్తోత్ర పారాయణలు, మినప సున్ని ఉండలు, ఇడ్లీ, వడలు దానం చేయాలి. పశు పక్షాదులకు ఆహారాన్ని పెట్టడం. పసుపు రంగు వస్త్రాలను, నీలిరంగు వస్త్రాలను దానం చేయడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

"

read more related news

నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉందంటే...

నూతన సంవత్సరంలో వృషభరాశి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

 

 

click me!