Aries:2020లో మేషరాశి ఫలితాలు..

Published : Dec 27, 2019, 10:16 AM ISTUpdated : Dec 27, 2019, 01:31 PM IST
Aries:2020లో మేషరాశి ఫలితాలు..

సారాంశం

వృత్తి ఉద్యోగాదుల్లో అనవసర ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారులతో అనుకూలతకోసం ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే దిశగా ఆలోచనలు సాగుతాయి. లాభాలు వచ్చినా అవి సద్వినియోగ పడవు. అనుకున్నంత స్థాయిలో తృప్తి ఉండదు. దానధర్మాలకు అధిక వ్యయం చేయడం మంచిది. పని చేయాలంటే కొంత బద్ధకం ఉంటుంది.

 విద్యార్థులకు ఉన్నత చదువులకు అవకాశం పెరుగుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. తమకంటే పెద్దవారితో జాగ్రత్తగా మెలగాలి. వారి అనుభూతులు ఎప్పటికప్పుడు వింటూ, వారి జ్ఞానాన్ని పంచుకునే దిశగా వీరు ప్రయత్నం చేయాలి.  అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి.  సంఘంలో గౌరవంకోసం పాటుపడతారు. గౌరవహాని జరుగకుండా జాగ్రత్తపడాలి.

వృత్తి ఉద్యోగాదుల్లో అనవసర ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారులతో అనుకూలతకోసం ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే దిశగా ఆలోచనలు సాగుతాయి. లాభాలు వచ్చినా అవి సద్వినియోగ పడవు. అనుకున్నంత స్థాయిలో తృప్తి ఉండదు. దానధర్మాలకు అధిక వ్యయం చేయడం మంచిది. పని చేయాలంటే కొంత బద్ధకం ఉంటుంది. బద్ధకాన్ని వదిలించుకొని ముందుకు సాగడం మంచిది. దూర ప్రయాణాల్లో ఆధ్యాత్మిక యాత్రలు చేయడం మంచిది. ఆధ్యాత్మిక యాత్రలు బాగా ఉపకరిస్తాయి.

ఇది కూడా చదవండి..taurus : 2020లో వృషభ రాశి ఫలితాలు...

విద్యార్థులు చదువుల విషయంలో జాగ్రత్త వహించాలి. వారి ఆలోచనలు వేరేవైపు వెళ్ళకుండా చూసుకోవాలి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. శ్రమ, కాలం, ధనం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. అధికారులతో అప్రమత్తత అవసరం. విద్యార్థులు ఎవరైనా చెపితే విని దానిని అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. తాము చదవడం కంటే వినడం ద్వారా వీరు ఎక్కువగా గ్రహించగలుగుతారు. సహకారం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు ఆలోచించి చేయాలి. మాటల్లో తొందరపాటు పనికిరాదు. కుటుంబ సంబంధాలలో తొందరపడి నిర్ణయాలు పనికిరావు.

వీరికి సంతృప్తి తక్కువగా ఉంటుంది. సేవలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దైవారాధన, దైవ కార్యక్రమాలు చేయడంమంచిది. ఊహించని ఇబ్బందులు, అనవసర ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ఈ రాశివారు బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామాలు, లేదా వాకింగ్‌ చేయడం తప్పనిసరి. దక్షిణామూర్తి ఆరాధన,  ప్రత్యక్షంగా గురువులను కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం చేయాలి. దుర్గా స్తోత్ర పారాయణలు, మినప సున్ని ఉండలు, ఇడ్లీ, వడలు దానం చేయాలి. పశు పక్షాదులకు ఆహారాన్ని పెట్టి. పసుపు రంగు వస్త్రాలను, నీలిరంగు వస్త్రాలను దానం చేయడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

PREV
click me!

Recommended Stories

Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు అదృష్టం ఎక్కువ.. రాజులాంటి జీవితం గడుపుతారు!
Guru Shukra Gochar:100 ఏళ్ల తర్వాత రాజయోగం.. డిసెంబర్ 20 తర్వాత ఈ రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్