Today Rasi Phalalu : 25 డిసెంబర్ 2019 బుధవారం రాశిఫలాలు

Published : Dec 25, 2019, 07:26 AM IST
Today Rasi Phalalu : 25 డిసెంబర్ 2019 బుధవారం రాశిఫలాలు

సారాంశం

అన్ని రాశులవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పనులలో ఆచి, తూచి వ్యవహరించాలి. తమకు అనుకూలమైన సమయాన్ని నిర్ణయించుకోవాలి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలపై దృష్టి పెట్టరాదు.

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఊహించని ఒత్తిడి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. వైద్య శాలలసందర్శనం ఉంటుంది. శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : నూతన పరిచయస్తుల వలన అనుకూలత ఏర్పడుతుంది. పాత మిత్రుల కలయిక జరిగే అవకాశం కనబడుతుంది. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. సంఘంలో గౌరవం పెంచుకునే ఆలోచన చేస్తారు. భాగస్వామ్య ఒప్పందాలు పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక కొరత ఏదో రూపంలో తీరుతుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విద్యార్థులకు అనుకూల సమయం. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పోటీలలో గెలుపుకై అధిక ప్రయత్నం చేస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు. ఎవరో ఒకరు ఏదో రూపంలో బహుమతులు అందజేస్తారు. రుణ సంబంధ ఆలోచనలు తగ్గుతాయి. తమకై తమకు శ్రద్ధ పెరుగుతుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : చిత్త చాంచల్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం అవసరం. సంతానం విషయంలో పురోభివృద్ధి కనిపిస్తుంది. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం చేయాలి. దైవకార్యాలలో అధికంగా సమయాన్ని కేటాయించాలి. ధనాన్ని వాటికోసం కేటాయించాలి.  

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సౌకర్యాలు కావాలనే ఆలోచన పెరుగుతుంది. వాటికోసం అధిక ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలలో ఒత్తిడి పెరుగుతుంది. అందరికన్నా ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆలోచన చేస్తారు. గృహ నిర్మాణం కోసం చేసే పనులలో తొందరపాటు పనికిరాదు. జాగ్రత్త అవసరం.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : రచయితలకు కొంత ఒత్తిడి సమయం. వ్యాపార ప్రయాణాలు అభివృద్ధి చెందుతాయి. అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. పరక్రమంతో పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై విజయంకోసం ఆరాటపడతారు. కమ్యూనికేషన్స్ విస్తరించుకునే ప్రయత్నం. మీడియా రంగం వారికి అనుకూలం.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనుకున్న పనులు పూర్తి చేయడానికి ముందు వెనుక కూడా ఆలోచించరు. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో అనుకూల వాతావరణం కోసం ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. అన్ని పనులలోనూ సంతృప్తి లభిస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శారీరక శ్రమ అధికం అవుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత శ్రమ అధికం అవుతుంది. ప్రణాళికలకు అనుగుణంగా సమయాన్ని కేటాయించుకునే ప్రయత్నం చేయాలి. తొందరపాటు పనులు, నిర్ణయాలు పనికిరావు. శ్రమకు తగిన గుర్తింపుకోసం ప్రయత్నం ఉంటుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. పాదాల నొప్పులు వస్తాయి. విహార యాత్రలు చేయాలనే ఆలోచన బాగా పెరుగుతుంది. దానధర్మాలకై డబ్బును ఖర్చు చేయడం మంచింది. ఇతరులకోసం ఆదాయాన్ని ఖర్చు చేసే సందర్భంలో ఒకసారి ఆలోచించాలి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం పెరుగుతుంది. అన్ని రకాల ఆదాయాలు లభిస్తాయి. వచ్చిన లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. లాభాలపై ఆలోచన ఎక్కువ అవుతుంది. అన్ని పనులలో సంతోషంగా కాలం గడుపుతారు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సాంఘిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగ సంబంధ ఒత్తిడి అధికం అవుతుంది. తోటి వారితో కలిసి మెలిసి ఉండేలా ప్రయత్నం చేయాలి. అన్ని పనుల్లో సంతోషం లభిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత అధిక శ్రమ అవసరం అవుతుంది. అన్ని పనులలోనూ సంతృప్తి తక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి.

PREV
click me!

Recommended Stories

Vaishakha Purnima: రాహు నక్షత్రంలో చంద్రుడు..ఈ రాశులకు విజయం నడుచుకుంటూ వస్తుంది
Lucky Zodiac Signs: గ్రహాల అనుకూల సంచారం.. ఈ 6 రాశులవారికి ఊహించని రాజయోగం, ఉన్నత పదవులు!