వృషభం వారికి ఆర్థిక లాభం, మేషం వారికి జాగ్రత్తలు అవసరం

Published : May 13, 2025, 04:30 AM IST
వృషభం వారికి ఆర్థిక లాభం, మేషం వారికి జాగ్రత్తలు అవసరం

సారాంశం

మంగళవారం రాశిఫలంలో వృషభం వారికి ఆర్థిక పురోగతి, మేషం వారికి ఆరోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. 

మేషం
ఈ రోజు మేష రాశి వారు నగదు వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు కలగవచ్చు. చేపట్టిన పనుల్లో పురోగతి ఆలస్యం కావచ్చు. కుటుంబ సభ్యుల సలహాలను పాటించడం మేలు చేస్తుంది.

వృషభం
వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రగతి కనిపిస్తుంది. గత రుణాలను పూర్తిగా తీర్చుకునే అవకాశముంది. పెద్దల సహవాసంతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడం, ఉద్యోగంలో పదోన్నతి వంటి అనేక లాభాలు ఉంటాయి.

మిథునం
మిథున రాశి వారు తొందరపాటు మాటలు వద్దు. వృత్తి రంగంలో సానుకూలత ఉన్నా, గృహ నిర్మాణాలు ఆలస్యం అవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.

కర్కాటకం
ఈ రోజు కర్కాటక రాశి వారికి వృత్తి జీవితం తక్కువ పనిభారం తో సాగుతుంది. కానీ వివాదాలకు అవకాశముంది. విందు వినోదాలలో పాల్గొనడం, వ్యాపారాల్లో ఉత్సాహం కనిపిస్తుంది.

సింహం
సింహ రాశి వారికి స్నేహితుల ద్వారా శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు, ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి.

కన్య
కన్య రాశి వారు కొత్త వ్యాపారం మొదలుపెడతారు. అవసరానికి ధనం అందుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

తుల
తుల రాశి వారు పెద్దల సహకారంతో కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయాల్లో తేలికపాటి ఇబ్బందులు ఉంటాయి.

వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వృత్తి రంగంలో సానుకూల వాతావరణం. ప్రముఖుల నుంచి ప్రత్యేక ఆహ్వానాలు రావచ్చు.

ధనస్సు
ఈ రోజు ధనస్సు రాశి వారు సేవా కార్యక్రమాలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యలో శుభవార్తలు వస్తాయి. బంధువుల రాకతో ఆనందం. ఆదాయం అన్ని వైపులా పొందుతారు.

మకరం
మకర రాశి వారు పాత రుణాలను తీర్చే అవకాశం ఉంది. దూర బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన సమాచారం వస్తుంది. ధన పరమైన ఇబ్బందులు ఉన్నా, అవి అధిగమిస్తారు. వ్యక్తిగత నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం
కుంభ రాశి వారికి చిన్ననాటి మిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. పనులు ఆలస్యం అయినా పూర్తవుతాయి. గృహ, వాహన కొనుగోళ్లలో ఆలస్యం ఉండవచ్చు.

మీనం
మీనం రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తొచ్చి బాధించవచ్చు. ఇంటా బయట అనుకూలత ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. లాభాలు అందుతాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2026 వృషభ రాశి ఫలితాలు ఇవిగో
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి మొండితనం ఎక్కువ.. భరించడం చాలా కష్టం!