
Mahashivratri 2023: మహా శివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. ఈ పండుగ భోళాశంకరుడికి ఎంతో ప్రత్యేకమైనది. మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడి భక్తులంతా నిష్టగా ఉపవాసం ఉండి.. శివుడిని ఆరాధిస్తూ.. మహాదేవుడిని ప్రసన్నం చేసుకుంటారు. పరమేశ్వరుడిని భక్తితో పూజిస్తే.. ఎంతటి కష్టాలనైనా పోగొడుతాడని జ్యోతిష్యులు చెబుతారు. ఈ సారి మహాశివరాత్రి ఫిబ్రవరి 18 వచ్చింది. మరి ఈ మహాశివరాత్రి ఏయే రాశుల వారికి ప్రయోజనకరంగా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..
మేషరాశి
మేశరాశి వారాకి ఈ మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. మేషరాశి వారు శివుడి అనుగ్రహం పొందుతారు. అంతేకాదు శివుడి అనుగ్రహం వల్ల వీరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. స్థానికులు కొత్త ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు.
వృషభ రాశి
వృషభ రాశి వారు కూడా శివుడి ఆశీస్సులు పొందుతారు. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ ను ఈ శివరాత్రికి పొందుతారు. అంతేకాదు చాలా కాలంగా ఏవో కారణాల వల్ల ఆగిపోయిన పనులు పూర్తి అయ్యే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు సీనియర్ల నుంచి పూర్తి మద్దతును పొందుతారు. శివుడి ఆశీస్సులతో ఈ రాశి వారు వాహనాలు కొనొచ్చు.
మిథున రాశి
మిథున రాశి వారు శివుడి దయ వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మీరు చాలా కాలంగా వ్యాధితో బాధపడుతున్నట్టైతే దాని నుంచి బయటపడతారు. దీంతో మీ కెరీర్ కూడా ఫాస్ట్ గా ముందుకు సాగుతుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారు మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటే ఎన్నో అద్బుతాలు జరుగుతాయి. ఉపవాసం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వృత్తి గురించి మాట్లాడుకున్నట్టైతే వీళ్లు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. వారి వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. కెరీర్ లో ముందుకు సాగడానికి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగులు శ్రమకు అందరి నుంచి ప్రశంసలు పొందుతారు.
తులా రాశి
తులారాశి వారు కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు పొందుతారు. పరమ శివుడి ఆశీస్సుల వల్ల వీరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ సమయం వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎక్కువ లాభాలను పొందొచ్చు.
కుంభరాశి
మహాశివరాత్రి పర్వదినం కుంభరాశి వారికి సువర్ణావకాశంగా నిలుస్తుంది. ఏ పని మొదలు పెట్టినా.. అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. అంతేకాదు అకస్మత్తుగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వరిస్తాయి.