కార్తీక సోమవారం... మనసుని అదుపులో పెట్టాలి

By ramya neerukondaFirst Published Nov 12, 2018, 12:28 PM IST
Highlights

కార్తీకమాసం నెలరోజులు దీక్షలో ఉండవచ్చు. అలా లేనివారు కనీసం కార్తిక సోమవారాలైనా కొన్ని నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెపుతుంది. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు.

సంవత్సరం మొత్తంలో భగవత్‌ ఆరాధానకు మిక్కిలి శ్రేష్ఠమైన మాసం ఇది. యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కొంటాడు. వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గరకు వచ్చే మాసం. అందువల్ల ఈ మాసంలో ఏ వ్రతం చేసినా, దానం చేసినా, మనస్ఫూర్తిగా ఏ చిన్న మంచి పని చేసినా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో విధిగా ఆచరించవలసిన నియమాలలో ముఖ్యమైనది ప్రాతఃకాలంలో అంటే సూర్యోదయానికి పూర్వం స్నానం చేయడం.  ఇది తప్పనిసరి అని ఆరోగ్యశాస్త్రం కూడా చెపుతుంది. దానివలన కాయక, వాచిక, మానసికాది దోషాలు పోతాయి.

స్నానం చేయడం అనేది తమకు తోచినప్పుడు కాకుండా సూర్యోదయానికి పూర్వం ప్రాతఃకాలంలో చేయడం శ్రేష్ఠం. దీనివలన రూపం, బలం, తేజం, శౌచం, ఆయుష్షు, తపస్సు, ఆరోగ్యం, మేధస్సు పెరుగుతాయి. లోభం, దుస్స్వప్నాలు నశిస్తాయి. ఈ పది గుణాలు రావడానికి కారణం సూర్య చంద్రులే. రాత్రంతా చంద్ర నక్షత్రాలు, పగలు సూర్యరశ్మి నీడులో ప్రవేశిస్తాయి. రాత్రి నీడులో రోగ కీటకాలు లోపల దాగి ఉంటాయి. సూర్యోదయాత్పూర్వం అవి పైకి వస్తాయి. కాబ్టి ఉదయమే స్నానం చేయడం మంచిది.

కార్తీకమాసం నెలరోజులు దీక్షలో ఉండవచ్చు. అలా లేనివారు కనీసం కార్తిక సోమవారాలైనా కొన్ని నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెపుతుంది. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు.

సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనః కారకుడు. మనస్సును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు అంటే అనవసరమైన కోరికలవైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదు తెలుసుకుని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాలు ప్రాతఃకాలాన్నే స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడిని చూసాక భోజనం చేయడం మంచిది.

ఒక సర్వేలో కూడా తేలిన విషయం ఏమిటంటే సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించేవారి శాతం  మిగతా వాడుకంటే ఎక్కువగా ఉంటుంది. కారణం చంద్రుడు. మనస్సు చాలా చంచలమైనది. అది ఒకరి మాటవినదు. తనకు తోచినట్లు తాను చేసుకుంటూ వెళుతుంది. దానిని అదుపులో పెట్టుకోవడం మానవునిగా ప్టుడునందుకు మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని మరచి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేసామని, పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుటాంరు. ఇది ఎంతమాత్రం సరియైనది కాదు.

ఒక కథ ప్రకారం చంద్రునికి 27 నక్షత్రాలతో వివాహం చేయగా ఎక్కువగా కృత్తికా నక్షత్రం దగ్గరకే ఉండేవాడట.   మిగతా నక్షత్రాలతో పోలిచూస్తే కృత్తికా నక్షత్రం చాలా ఆకర్షణగా, అందంగా ఉంటుంది. మిగతా నక్షత్రాలకు కోపం వచ్చేది. ఆ నక్షత్రాలు వెళ్ళి వాడు గోడును వినిపించాయి. అప్పుడు చంద్రుడు శాపగ్రస్తుడయ్యాడని, తరువాత నుంచి కృత్తికా నక్షత్రం తన అందాన్ని కోల్పోయిందని ప్రతీతి.

మనస్సును అదుపులో పెట్టుకోవడం అందరికీ అవసరమే కాబ్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారాల వ్రతం చేయాలి. ఎవరికి వారు తాము ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. చేసే పనులలో ఇది కూడా ఒక రకంగా ఉపకరిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!