11నవంబర్ 2018 ఆదివారం రాశిఫలాలు

Published : Nov 11, 2018, 09:10 AM IST
11నవంబర్ 2018 ఆదివారం రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పనులలో ఒత్తిడి ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. కొన్ని పనులు జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు.  చేసే ఉద్యోగాలలో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో అనవసర ఒత్తిడి తెచ్చుకోరాదు. పిట్టలకు ఆహారం పెట్టడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. శ్రమ అధికంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాలనే కోరిక పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది. సంతృప్తిలోపం ఏర్పడుతుంది. పనులు పూర్తిచేయడంలో ఆలస్యం. ఓం నమఃశ్శివాయ జపంచేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనారోగ్య భావనలు ఉంటాయి. పరామర్శలు చేస్తారు. ధనాన్ని దొంగలించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు సానుకూలపడవు. ఇతరులపై ఆధారపడతారు. చెడు స్నేహాలపై దృష్టి ఉంటుంది. దుఃఖం ఉంటుంది. ఓం నమఃశ్శివాయ జపం చేసుకోవాలి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాలు అనుకూలించవు. నూతన పరిచయాలు చేసుకోరాదు. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. భాగస్వామ్య అనుబంధాలు కోల్పోయే సూచనలు ఉంటాయి. విభేదాలు వచ్చే సూచనలు. పలుకుబడి తగ్గే సూచనలు ఉన్నాయి. నరసింహస్తోత్ర పారాయణ మంచిఫలితాలిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : గెలుపుకై తపన పడతారు. శత్రువులపై విజయం సాధించాలనే కోరిక అధికం. శ్రమాధిక్యం ఉంటుంది. ఋణసంబంధ ఆలోచనలనుంచి విముక్తి ఉంటుంది. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. కలహాల జోలికి పోరాదు. పశు పక్షాదులకు ఆహారం పెట్టడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన లోపాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. సృజనాత్మకత తగ్గుతుంది. విద్యార్థులకు కష్టకాలం ఉంటుంది. కాలాన్ని దుర్వినియోగం చేయరాదు. అనవసర ఖర్చులు చేయరాదు. శ్రమను జాగ్రత్తగా వినియోగించాలి. ఆదిత్య హృదయ స్తోత్రపారాయణ మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టరాదు. విద్యార్థులకు అధిక శ్రమ ఉంటుంది. పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురౌతాయి. ప్రయాణాల్లో ఒత్తిడి అధికం. ఆహారంలో సమయ పాలన అవసరం. అనారోగ్య సూచన. క్రీం అచ్యుతానంత గోవిందజపంమంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. పనులలో సంతోషం కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వన భోజనాలకు వెళ్ళాలనే ఆలోచన పెరుగుతుంది. వెళ్ళి వస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. శ్రమకు తగిన ఫలితం వస్తుంది. శ్రీ హయగ్రీవాయ నమః జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మాట విలువ తగ్గుతుంది. ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపాటు పనికిరాదు. మధ్యవర్తిత్వాలు చేయరాదు. కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. సంతోషాన్ని కోల్పోయే సూచనలు.    నిల్వ ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లోపాలు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రీదత్తశ్శరణం మమ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్య సాధన అవసరం. పనులకు అనుగుణంగా ప్రణాళికలు మార్పు చేసుకోవాలి. సుఖ దుఃఖాలు సమానంగా ఉంటాయి. చక్కి ప్రయత్నశీలత ఉంటుంది. ఆశయ సాధనకై పరితపిస్తారు. శ్రీరామజయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతిలోపం ఉంటుంది. శయ్యాసౌఖ్యం తక్కువ. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. సుఖం కోసం ఆరాటపడతారు. ఇతరులపై ఆధారపడతారు.   ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సమయం వృథా అవుతుంది. శ్రీ దత్తశ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేస్తారు. ధనం వినియోగపడుతుంది. కళాకారులకు అనుకూల సమయం. తెలియని ఆదాయ మార్గాలు ఉంటాయి. సంతృప్తి పెరుగుతుంది. శ్రీ దత్తశ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

PREV
click me!

Recommended Stories

AI Horoscope: ఓ రాశివారు వృథా ఖర్చులు తగ్గించుకోవాలి
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కుతాయి!