Astrology: ట్రాఫిక్ లో ఇరుక్కుంటే ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా..?

Published : May 26, 2022, 02:11 PM ISTUpdated : May 26, 2022, 02:14 PM IST
Astrology:  ట్రాఫిక్ లో ఇరుక్కుంటే ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా..?

సారాంశం

ఒకవేళ ఈ ట్రాఫిక్ జామ్ లో అన్ని రాశులవారు ఒకేసారి ఇరుక్కుపోతే.. వారి రాశి చక్రం ప్రకారం ఎవరు ఎలా స్పందిస్తారో ఓసారి చూద్దాం..  

మన దేశంలో రోడ్డు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీక్ డే, వీకెండ్ అనే తేడా లేకుండా... ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. ముఖ్యంగా పట్టణాల్లో ట్రాఫిక్ జామ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవేళ ఈ ట్రాఫిక్ జామ్ లో అన్ని రాశులవారు ఒకేసారి ఇరుక్కుపోతే.. వారి రాశి చక్రం ప్రకారం ఎవరు ఎలా స్పందిస్తారో ఓసారి చూద్దాం..

1.మేష రాశి..
మేష రాశివారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే... వెంటనే కారులో నుంచి కిందకు దిగి.. అసలు ట్రాఫిక్ జామ్ ఎందుకు అయ్యింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఎవరి వల్ల అయిన ట్రాఫిక్ జామ్ అయ్యిందనేది తెలుసుకొని వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తారు.

2.వృషభ రాశి..
ఈ రాశివారికి చాలా బద్దకం ఎక్కువ.  కాబట్టి.. కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాతే వెళదామని అనుకుంటారు. కానీ.. ఆఫీసు వర్క్ ఏదైనా ఉంటే మాత్రం దానిని చేయడం మొదలుపెడతారు. వెంటనే లాప్ టాప్ తీసుకొని వర్క్ చేయడం ప్రారంభిస్తారు.

3.మిథున రాశి..

మిథున రాశివారు ట్రాఫిక్ జామ్ అయ్యి కారు ఆగిపోగానే.. కారు అద్దం కిందకు దించి.. పక్క వాహనంలో ఉన్నవారిని.. ఏం జరిగింది..? ఎందుకు కారు ఆగింది..? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు ట్రాఫిక్ లో కారు ఇరుక్కుపోతే... ప్రశాంతంగా తమ బ్యాగులో ఏవైనా చిరు తిండ్లు ఉంటే.. వాటిని తీసి తినడం మొదలుపెడతారు. ఆ విషయాన్ని మర్చిపోయేలా.. మిగిలిన విషయాల గురించి మాట్లాడటం మొదలుపెడతారు.

5.సింహ రాశి..
సింహ రాశివారు అయితే.. ట్రాపిక్ జామ్ అయితే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి అంటూ.. ప్రశాతంగా అక్కడే.. జామ్ అయిన ట్రాఫిక్ మధ్యలో సెల్ఫీలు దిగుతారు. అలాంటి పనులు కూడా వీరు చేయగలరు.

6.కన్య రాశి..
కన్య రాశివారు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటే.. అది ఎందుకు జరిగింది అని తెలుసుకుంటారు. ఆ తర్వాత.. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఇతరులతో చర్చంచి.. అందుకు తగిన నిర్ణయం తీసుకుంటారు.

7.తుల రాశి..
ఈ రాశివారికి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అయితే.. వీరి పక్కన కర్కాటక రాశివారు ఉంటే మాత్రం.. వారి కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు.

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు కొంచెం రొమాంటిక్. పరిస్థితి ఎలా ఉన్నా తమ రొమాంటిక్ ఆలోచనలను మాత్రం పక్కన పెట్టరు. తమతో పాటు ఎవరైనా అందమైన వ్యక్తి ఉంటే.. వారితో మాటలు కలిపే ప్రయత్నం చేస్తారు.

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినా కూడా.. ఇతరులను ఎంటర్ టైన్ చేయడంలో వెనకడుగు వేయరు. గతంలో తాము చేసిన సాహసాల గురించి చెబుతూ.. అందరినీ సంతోష పెడతారు.

10. మకరరాశి..
ఈ రాశివారికి కంగారు ఎక్కువ. ట్రాఫిక్ లో ఇరుక్కు పోయినప్పుడు.. తరచూ గడియారం వంక చూస్తూ ఉంటారు. ఎంత సమయం వృథా అయ్యిందో అని లెక్కేసుకుంటూ ఉంటారు. వీరు టైమ్ చూస్తూనే ఉంటారు.. టెన్షన్ పడుతూ ఉంటారు.

11.కుంభ రాశి.
ఈ కుంభ రాశివారు కూడా కొంచెం టెన్షన్ పడతారు. అయితే.. తమతోపాటు ఉన్నవారు ఎవరు ఏమి మాట్లాడుతున్నారు అని వింటూ ఉంటారు. ఆ తర్వాత వాటి నుంచి తమ నిర్ణయం తీసుకుంటారు. కామ్ గా ఉన్నట్లు ఉంటూనే.. అన్ని వింటూ ఉంటారు.

12.మీన రాశి..
మీన రాశివారు అందరి కన్నా చాలా కామ్ గా ఉంటారు. అక్కడి ప్రపంచాన్ని మర్చిపోయి... వారు వేరే ఏదో ఒక ప్రపంచంలో ఉండిపోతారు. వేరే ఏదో ఊహించుకుంటూ ఉంటారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Leo Horoscope 2026: కొత్త సంవత్సరంలో సింహ రాశి జాతకం, కనక వర్షం కురవనుందా?
Dream Meaning: క‌ల‌లో ఈ వ‌స్తువులు క‌నిపిస్తే.. శ‌ని దేవుడి ఆశీర్వాదం ఉన్న‌ట్లే, మీ సుడి తిర‌గ‌డం ఖాయం