తుల రాశిపై ఏలిననాటి శని ప్రభావం

By ramya neerukondaFirst Published Jan 8, 2019, 2:12 PM IST
Highlights

వీరికి సేవకజన సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. దగ్గరి ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కాస్త ఒత్తిడితో కూడిన సమయం ఉంటుంది. పనులు పూర్తి కావడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది. 

వీరికి సేవకజన సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. దగ్గరి ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కాస్త ఒత్తిడితో కూడిన సమయం ఉంటుంది. పనులు పూర్తి కావడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది.  ఏ పని మొదలు పెట్టిన ఒత్తిడి మాత్రం తప్పదు. ఎదుటివారు సహకరిస్తున్నారు కదా అని ఎక్కువగా  తీసుకోకూడదు. జాగ్రత్తపడాలి.

సంతాన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. సంతానం అనుకున్నంత సంతృప్తికరంగా ఉండదు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. తులారాశివారికి సంతానం విషయంలో మానసిక ఒత్తిడి ఎందుకనగా తమ ఆలోచలకు అనుగుణంగా శరీరాన్ని కదల్చలేరు. పనుల ఒత్తిడి పెరుగుతుంది. సంతానం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. ఆలోచనల్లో మందత్వం ఉంటుంది. అనగా ఏ పని చేయాలన్నా కొత్త ఆలోచనలు రావు. చేసిన పనే అదే రకంగా చేస్తూ ఉంటే చూసే వారికి నూతనత్వం కనపడదు.

సంతానం విషయంలో కూడా వారు ఎప్పుడూ ఏదో ఒకి కొత్త విషయం కావాలనుకుాంరు. ఆ విషయాన్ని అందించ లేరు. అక్కడ సంతానానికి వీరు ఇబ్బంది ఏర్పడుతుంది.

ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు అనుకూలిస్తాయి. వేరే పరంగా విదేశాలకు వెళ్ళాలంటే అది కుదరని పని. ఎందుకంటే వీరికి సంతృప్తి తక్కువగా ఉంటుంది. కావున వీరు దూర ప్రయాణాల్లో ఆధ్యాత్మిక యాత్రలకు  ప్రాముఖ్యం ఇస్తే కాసేపు ఆ దేవాలయాల్లో ప్రశాంతంగా గడిపితే బావుంటుంది. వీరికి గుడిలో దేవుడి కన్నా చుట్టు ప్రక్కల ఉండే ప్రకృతి అంటే చాలా ఇష్టం వాటిని చూస్తూ సమయం గడిపేస్తారు.

విశ్రాంతి తక్కువగా ఉంటుంది. అనుకున్న సమయంలో నిద్రపోలేరు. ప్రయాణాలు అనుకున్నంత సంతోషంగా సాగవు. పాదాల నొప్పులు ఉంాయి. కొంచెం తిరిగినా అలసటకు గురి అవుతారు. ఎక్కువ శ్రమ పడలేరు. కొంత భయం కూడా ఉంటుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలమా లేదా అనే భయంతో కూడా వీరికి రాత్రి నిద్ర పట్టక పోవచ్చు. ప్రతీ విషయంలోనూ భయం ఉంటుంది. భయం ఎందుకంటే శరీరం కొంచెం బద్ధకంగా ఉంటుంది. ఆలోచనలు కూడా అలాగే ఉంాయి.

ప్రస్తుత కాలంలో పోటీ  సమాజంలో మనం నివసిస్తున్నాం. ఆ పోటీ  సమాజానికి అనుగుణంగా అంత వేగంగా వెళ్ళాలంటే  శని వెళ్ళలేడు. ప్రతీ విషయాన్ని పూర్వా పరాలు ఆలోచించి కొంత లోతుల్లోకి వెళ్ళి చూసే తత్వం కలవారు. అలా ప్రతీ విషయంలో మూలల్లోకి వెళ్ళి మూలాలను వెతికినప్పుడు దాని అసలు రూపం తెలుస్తుంది. ఆ పని చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం ఆలస్యం అవుతుంది. కాని శని నెమ్మదితనంతో ఉన్నా కాని జ్ఞానానికి కారకుడు.

ఏ పని చేసినా అందులో జ్ఞానాన్ని అందిస్తాడు. కొంత మూలాలు వెతకగానే అందులో ఏదో ఒక విషయం తెలిసి దాని గురించి ఆలోచించాలనే తపన పెరుగుతుంది. కాబ్టి ప్రస్తుత సమాజంలో ఉన్నా వేగానికి సరికాడు. ఈ కాలం వారికి అప్పికప్పుడు కావలసిన విషయాలు, అప్పికి తృప్తిని ఇచ్చే విషయాలు, అప్పికి పేరు వచ్చే విషయాలు కావాలి కాని కొంత ఆలస్యం అయినా దీర్ఘకాలిక ప్రయోజనాలవైపు దృష్టి ఉండదు. కావున అక్కడ కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది.

ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. సహకారం రూపంలో తీసుకుంటూ వేరే వారికి డబ్బులు కాని, వస్తు, వస్త్ర రూపాల్లో తమ సహకారాన్ని అందించాలి. అప్పుడు మాత్రమే తమకు సహకారం ఇచ్చేవారు సంతోషంగా ఆనందగా ఇస్తారు. లేకపోతే బలవంతంగా మొహమానికి ఇస్తారు. ఆ మొహమానికి చేసే పనిలో శ్రద్ధ ఉండదు. కావున జాగ్రత్త అవసరం.

విశ్రాంతి తక్కువగా ఉంటుంది కావున వీరికి రాత్రి సమయాల్లో నిద్ర తొందరగా పట్టదు. వీరు కొంత కాలం రాత్రి సమయాల్లో పని చేసే అవకాశం ఉంటే ప్రయత్నం చేయాలి. ఉదయం పూట ఎక్కువ సేపు దైవధ్యానాలు, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారించాలి. అప్పుడు మాత్రమే విశ్రాంతిలోపం పాదాల నొప్పులు అలసటలు తెలియవు. వాటిపై ధ్యాస తగ్గించుకోవాలి.

డా.ఎస్.ప్రతిభ

click me!