కన్యా రాశివారిపై ఏలిన నాటి శని ప్రభావం

By ramya neerukondaFirst Published Jan 7, 2019, 2:33 PM IST
Highlights

శారీరక శ్రమ ఉంటుంది. కొంచెం పనులు వాయిదా వేసే సూచనలు కనబడుతున్నాయి. బద్ధకాన్ని తగ్గించుకోవాలి. అనుకున్న పనులు వెంటనే పూర్తిచేసే ప్రయత్నం చేయాలి. పనులలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మొదలు పెట్టిన పనిని పూర్తి చేసేవరకు వదిలిపెట్టకూడదు.

శారీరక శ్రమ ఉంటుంది. కొంచెం పనులు వాయిదా వేసే సూచనలు కనబడుతున్నాయి. బద్ధకాన్ని తగ్గించుకోవాలి. అనుకున్న పనులు వెంటనే పూర్తిచేసే ప్రయత్నం చేయాలి. పనులలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మొదలు పెట్టిన పనిని పూర్తి చేసేవరకు వదిలిపెట్టకూడదు. చివరి నిమిషం వరకు పనులను వాయిదా వేయకుండా ఒక ప్లానింగ్‌ ప్రకారం చేసుకుటూ వెళ్ళాలి. శరీర ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అభిరుచులకు అనుగుణంగా ఆలోచనలు మారుతుంటాయి.  ప్రయత్నశీలత, కృషి, పట్టుదల పెంచుకోవాలి.

సౌకర్యాలపై ఆసక్తి పెరుగుతుంది. వాిపైనే ఆలోచనలు అన్నీ ఉంాయి. అవి సమయానికి అందవు. అనారోగ్య సమస్యలు ఉంాయి. రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సౌకర్యాలు శ్రమను గురిచేస్తాయి.  సౌకర్యాలకోసం ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆహారంలో సమయ పాలన పాటించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే స్వీకరించాలి. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం మంచిది. జీర్ణ సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. గ్యాస్‌ ప్రాబ్లమ్స్‌ వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ రాశివారికి అర్దాష్టమ శని ఉంది కనుక శనికి సంబంధించిన పరిహారాలు  ఖచ్చితంగా తీసుకోవాలి. సౌకర్యాలపై అంత దృష్టి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి.

పోటీల్లో గెలవాలనే తపన ఉంటుంది. మనసు వెళ్ళినంత వేగంగా శరీరం కదలలేదు. శత్రువులను పెంచుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. పోటీల్లో తాము గెలిస్తే ఆ సమయానికి అందరూ మెచ్చు కుంటారు. కాని 100 మందిలో వీరే నెంబర్‌ వన్‌గా ఉన్నా కూడా 99 మంది వ్యతిరేకత వీరిపై అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. రోగనిరోధకశక్తి తగ్గే సూచనలు ఉన్నాయి. ఋణ సంబంధ లోపాలు ఇప్పుడే బయట పడే సూచనలు కనబడుతున్నాయి.

శరీర శ్రమ అధికంగా ఉంటుంది. కాని శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు రెండూ తక్కువగానే ఉంాయి. కావున ఆచి, తూచి వ్యవహరించాలి. శ్రమ పడడం చేయాలి కాని ఫలితాన్ని ఆశించకూడదు. ఫలితం ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఇప్పుడు వాత విషయాలు అన్నీ గుర్తు చేసుకొని బాధపడి ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. పక్కవారితో పోల్చుకోవడం పనికిరాదు. వాళ్ళు తక్కువ శ్రమ పడతున్నారు, నేను ఎక్కువ పడుతున్నారు. సంపాదన తక్కువగా ఉంది అనే ఆలోచనలు రానివ్వకూడదు. ఆ ఆలోచనలు వస్తే మనసు చికాకు పడి ఒత్తిడికి గురౌతారు. అనుకున్న పనులు ప్లాన్‌ పెట్టుకుని పూర్తి చేసుకోవడం మంచిది. తప్పనిసరిగా శారీరక వ్యాయామాలు చేయాలి. ప్రాణాయామం కూడా తప్పనిసరిగా చేయాలి.

సౌకర్యాలకోసం ఎదురు చూపులు ఉండకూడదు. ఉన్నదానిలో సర్దుకుపోయే తత్వం అలవాటు చేసుకోవాలి. వాహనాలు కూడా తమ దగ్గర ఉన్నా అవి అవసరానికి వినియోగపడకపోవచ్చు కూడా. లేదా ఆ సమయంలో వేరే వారికి ఉపయోగపడతాయి. వీరికి నడక, లేదా బస్సు లేదా సైకిల్‌ ఉన్నా ప్టించుకోకూడదు. దానివల్ల తమ ఆరోగ్యం మెరుగుపడుతుంది. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమౌతుంది. ఆరోగ్యం కోసం వేరే సమయాన్ని కేయించాల్సిన అవసరం ఉండదు.

పోటీల్లో ఏవైనా మార్పులు ఉంటే వాిని అర్థం చేసుకోవాలి. ఎక్కువ మొండితనంతో ప్రవర్తించకూడదు. అన్నికీ సర్దుకుపోయే గుణాన్ని మాత్రం తప్పకుండా అలవాటు చేసుకోవాలి.

వీరు శనికి సంబంధించిన దోష పరిహాలు అనగా వాకింగ్‌ ప్రాణాయామాలు, యోగాసనాలు వేయడం తప్పనిసరి. లేదా ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి రోజూ 21కి తక్కువ కాకుండా ప్రదక్షిణలు చేయడం మంచిది. దానివల్ల పుణ్యం పురుషార్థం రెండూ వస్తాయి. ఉదయం పూట వీలుకాని వారు ఈ పనులు తీరిక సమయాల్లోనైనా చేయాలి. మనసు ఇప్పుడు వద్దు అని చెపుతుంది కాని ఆ మనసు మాట వినకుండా శరీరాన్ని కష్టపెట్టవలసిందే. లేకపోతే అనారోగ్య సమస్యలు తప్పవు. ముందుగా తెలుసుకొని జాగ్రత్తలు పాటించడం మంచిది. వచ్చిన తరువాత చేయడం కంటే ప్రివెన్‌షన్‌ ఈజ్‌ బెట్టర్‌ దాన్‌ క్యూర్‌. సామెతను అనుసరించాలి.

డా.ఎస్.ప్రతిభ

click me!