మీనరాశిపై ఏలిననాటి శని ప్రభావం

By ramya neerukondaFirst Published Jan 14, 2019, 1:15 PM IST
Highlights

వీరికి సౌకర్యాల వల్ల ఒత్తిడి కలుగుతుంది. కాని వాటిపైదృష్టి తగ్గదు. తమకు సౌకర్యాలు సమయానికి లభించడం లేదని అనుకుంటూ ఉంటారు. గృహం ఉంటుంది కాని అందులో వసతులు సరిగా ఉండవు. తమకు అనుకూలంగా ఉండవు. వాహనం సమయానికి ఉపయోగపడకుండా ఉంటుంది.

వీరికి సౌకర్యాల వల్ల ఒత్తిడి కలుగుతుంది. కాని వాటిపైదృష్టి తగ్గదు. తమకు సౌకర్యాలు సమయానికి లభించడం లేదని అనుకుంటూ ఉంటారు. గృహం ఉంటుంది కాని అందులో వసతులు సరిగా ఉండవు. తమకు అనుకూలంగా ఉండవు. వాహనం సమయానికి ఉపయోగపడకుండా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. అజీర్తి సమస్యలు ఉంటాయి. వీరికి గృహం, వాహనం అన్నీ ఉన్నా కూడా అవి తమకు అవసరమైనప్పుడు అంత అనుకూలంగా ఉండవు. ఎదుటివారి కోసం వాటిని వినియోగించాల్సి వస్తుంది.

భాగస్వాములతో జాగ్రత్తగా అప్రమత్తంగా మెలగాలి. సామాజిక అనుబంధాలు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఎదుటివారితో అనుబంధాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. తొందరపాటు పనికిరాదు. తమకు ఇష్టం లేదని ఏ మాట తొందర పడి అనకూడదు. ఎదుటివారికి అనుకూలంగా ఉంటే వారు తమకు అనుకూలంగా వ్యవహరిస్తారు. తమకు

అధికారులతో ఒత్తిడి ఉంటుంది. తోటివారి సహాయ సహకారాలు తొందరగా లభించవు. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. షేర్‌ మార్క్లెపై దృష్టి ఉంటుంది. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. శారీరకబలం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శారీరకబలం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు.

 

విశ్రాంతికోసం ఆరాట పడతారు. విశ్రాంతి సరిగా లభించకపోతే ఉదయం లేచినప్పినుంచి మత్తుగా ఉంటారు. అన్ని రకాల ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. రహస్య స్థావరాలపై ఆన్వేషణ ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. శత్రువులంటే కాస్త భయం ఏర్పడుతుంది. సుఖం కోసం ఆరాటం పెరుగుతుంది.

వీరు సౌకర్యాలపై దృష్టి పెట్టకూడదు. వచ్చిన సౌకర్యాలను కూడా కాదనుకోవాలి. అప్పుడు మాత్రమే వీరి జీవితం సంతోషంగా ఉంటుంది. పక్కవారితో ఏ విషయాన్ని వీరు పోల్చి చూసుకోకూడదు. త్వరగా జీర్ణమయ్యే అహార పదార్థాలు తీసుకోవాలి. తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. నీటిని బాగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే శనిగ్రహ లోపాలు వీరికి దరిచేరవు.

పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త పడాలి. నూతన వ్యక్తులతో పరిచయాలు అంతగా పెంచుకోకూడదు. తెలిసినవారితో  సంతోషంగా మసలు కోవాలి. తాము చేసే పనులు జీవిత భాగస్వామికి కాని వ్యాపార భాగస్వాములకు కాని నచ్చుతాయా నచ్చవా అని ఆలోచించి చేయాలి. తాము ఎదుటివారి గురించి ఆలోచిస్తేనే ఎదుటివారు తమ గురించి ఆలోచిస్తారు. ఈ విషయాన్ని గుర్తెరిగి మసలు కోవాలి.

తాము ఉద్యోగం చేసే చోట తాము సర్దుకుపోయే తత్వం అలవాటు చేసుకోవాలి. స్టాక్‌ మార్కెట్ వాటిపై దృష్టి పెట్టకూడదు. తాము ఎంత కష్టపడితే అంత ఆదాయం మాత్రమే తీసుకోవాలి. అలసత్వాన్ని పక్కనపెట్టాలి.

విశ్రాంతికోసం ఆలోచించకూడదు. నిరంతర జపం చేస్తూ ఉండాలి. అప్పుడు విశ్రాంతి తక్కువైనా కూడా శరీరం అలసట చెందదు. మానసిక ప్రశాంతత అన్నికంటే ముఖ్యమైనది. వీరు మానసిక ప్రశాంతతకు ప్రాముఖ్యత ఇస్తే శరీర విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి ఉండదు.

శని గ్రహం లోపాలను, ఏవో ఇబ్బందులు, ఆటంకాలను కలిగిస్తాడు అనుకునే కంటే ఒక క్రమశిక్షణమైన జీవితాన్ని వ్యక్తిని అందిస్తాడు అనుకుంటే ఏ లోపం కూడా లోపంగా అనిపించదు. శని జ్ఞానాన్ని కలిగించే గ్రహం. తమకు అన్ని విషయాలు అనుభవంలోకి తీసుకువచ్చే గ్రహం. కాబట్టి శనిగ్రహం మంచి గ్రహమే కాని ఇబ్బందిని కలిగించేది కాదు అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి.

డా.ఎస్.ప్రతిభ

click me!