14జనవరి2019సోమవారం రాశిఫలాలు

By ramya neerukondaFirst Published Jan 14, 2019, 7:02 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంతృప్తి లోపం ఉంటుంది. పనులలో ఒత్తిడి ఉంటుంది. విహార యాత్రలపై దృష్టి పెరుగుతుంది. చేసే ఉద్యోగాలలో అలసత్వం ఏర్పడుతుంది. అనవసర శ్రమ ఉంటుంది. అధికారులతో చికాకులు ఏర్పడతాయి. సంఘంలో గౌరవహాని ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనుకున్న పనులు శ్రమతో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అనారోగ్య భావన ఉంటుంది. మానసిక ప్రశాంతత అలవాటు చేసుకోవాలి. చేసే పనుల్లో సంతృప్తి లోపం ఏర్పడుతుంది. తొందరపాటు పనికిరాదు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అభివృద్ధి ఉంటుంది. పెట్టుబడులు విస్తరిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలుటాంయి. పనుల్లో సంతోషం ఏర్పడుతుంది. భాగస్వాములతో అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విద్యార్థులు తక్కువ శ్రమతో ఫలితాల సాధన ఉంటుంది. పోీల్లో గెలుపు సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. సంతానం వల్ల ఒత్తిడి అధికంగా ఉండవచ్చు. అనుకోని ఇబ్బందులు ఉంటాయి. రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పోీల్లో గెలుపు సాధిస్తారు. విద్యార్థులకు కొంత శ్రమ ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : గృహావసరాలు తీరుతాయి. సౌకర్యాల వల్ల సంతోషం పెరుగుతుంది. ప్రయాణాల్లో సంతృప్తి కలుగుతుంది. విందు వినోదాలపై దృష్టి ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. సంతానసమస్యలు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్స్‌ వల్ల  ఒత్తిడి పెరుగుతుంది. అనుకోని ఇబ్బందులు వస్తాయి. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. ఆర్థిక నిల్వలపై దృష్టి పెరుగుతుంది. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. కమ్యూనికేషన్స్‌ వల్లఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ ఉంటుంది. అనవసర ఇబ్బందులు ఉంటాయి. చిత్త చాంచల్యం పెరుగుతుంది. పనులలో ఒత్తిడి ఉంటుంది. వాగ్దానాల వల్ల చిక్కులు వస్తాయి. మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక నిల్వలు కోల్పోతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విహార యాత్రలకై ఖర్చులు చేస్తారు. విందులు వినోదాల్లో పాల్గొటాంరు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. విశ్రాంతి లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పనులలో అలసత్వం ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన అవసరం. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. చేసే పనుల్లో సంతృప్తి ఉంటుంది. లాభాలపై దృష్టి ఉంటుంది. ఆశించిన ప్రయోజనాలు లభించకపోవచ్చు. అన్ని పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులు జాగ్రత్తగా మెలగాలి. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చేసే వృత్తులలో సంతోషం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూల సమయంగా ఉంటుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!