కర్కాటకరాశిపై ఏలిననాటి శని ప్రభావం

By ramya neerukondaFirst Published Jan 3, 2019, 1:43 PM IST
Highlights

కర్కాటకరాశి వారికి సేవకుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే తపన ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది. చదువుకోవాలనే ఆలోచన ఉన్నా  కష్టపడే తత్వం ఉండకపోవచ్చు. గోచార రీత్యా కొంత అనుకూలమైన భావనలే ఉన్నా కాని అనుకున్నంత తృప్తి ఉండదు. 

వీరికి విశ్రాంతిలోపం అధికంగా ఉంటుంది. అనవసర ఒత్తిడులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. శత్రువుల వల్ల బాధ పెరుగుతుంది. దేహసౌఖ్యం లోపిస్తుంది. మత్తుపదార్థాల జోలికి వెళ్ళకూడదు. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. ఊహల్లో విహరిస్తారు. వాటినుంచి బయట పడాలి. చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకరాశి వారికి సేవకుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే తపన ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది. చదువుకోవాలనే ఆలోచన ఉన్నా  కష్టపడే తత్వం ఉండకపోవచ్చు. గోచార రీత్యా కొంత అనుకూలమైన భావనలే ఉన్నా కాని అనుకున్నంత తృప్తి ఉండదు.  పరామర్శలు చేస్తారు. కమ్యూనికేషన్స్‌ వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది.

వీరు పోటీతత్వం తగ్గించుకోవాలి. శత్రువులు కొంత ఎక్కువ స్థాయిలో ఉంటారు. వ్యాపారస్తులు కొంత జాగ్రత్త వహించాలి. శారీరక బలం తగ్గుతుంది. రోగగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. పరామర్శలు ఉంటాయి. సోదరవర్గీయులతో కొంత పోట్లాటలు తగ్గించుకోవాలి. వృత్తి విద్యలపై ఆసక్తి ఉంటుంది.

ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు ఉంటాయి. చెడు సాహవాసాలు, దురభ్యాసాలు అలవాటు పడే సమయం. జాగ్రత్త అవసరం. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. అవయవాలు సరిగా పనిచేయవు. మోకాళ్ళ నొప్పులు వచ్చే సూచనలు. ఇతరులపై ఆధారపడతారు. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. లాభనష్టాలు సమానంగా ఉంటాయి.  

వీరికి ఖర్చులు ఉంటాయి, విశ్రాంతి ఉండదు కావున విశ్రాంతికోసం ఆలోచన ఉండకూడదు. రాత్రి విశ్రాంతి సరిగా లేకపోతే ఉదయం ఉత్సాహంగా లేచి ఏ పని చేయలేరు. రోజూ మొత్తం ఆ ప్రభావం ఉంటుంది. దానిని పెంచుకునే ప్రయత్నం చేయాలి.

సహకారం తీసుకోవడం వల్ల పుణ్యాన్ని కోల్పోతారు. ఆ పుణ్యాన్ని వారు పెంచుకునే ప్రయత్నం చేయాలి. సేవకుల ద్వారా సహకారం తీసుకుంటే వారికి తాను సహకారం తీసుకున్న మొత్తం కన్నా ఎక్కువ మొత్తాన్ని వారికి అందే విధంగా చూడాలి. లేకపోతే తమ పనుల్లో ఆటంకాలు, ఒత్తిడులు పెరుగుతాయి. ఆశింపుతో చేసే పనిలో కర్మబంధం పెరుగుతుంది. ఆశింపు లేకుండా చేయడం అలవాటు చేసుకోవాలి.

పోటీల వల్ల ఆ సమయానికి గుర్తింపు వస్తుంది కాని అది శాశ్వతంగా నిలిచి ఉండదు. పోటీల్లో గెలుపు ఉంటే శత్రువులు పెరుగుతారు. మళ్ళీ వాటిని ఎదుర్కోవాలి. ఇది ఒక చక్రంలా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఆ చక్రాన్ని ఎప్పికైనా అతి తొందరలో ఆపి వేయాలి.

ఊహించని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అనవసర పనుల జోలికి వెళ్ళకూడదు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో బద్ధకాన్ని తగ్గించుకోవాలి.

విశ్రాంతి తక్కువగా ఉంటుంది కాబట్టి వీరు యోగా, ప్రాణాయామం, ధ్యానం జపం ఎక్కువగా చేసుకోవాలి. అవి చేయడం వల్ల శరీరానికి అతి తక్కువ విశ్రాంతి సరిపోతుంది. అలసట కూడా ఉండదు. ముఖ్యంగా నిరంతరం ఏదైనా ఒక జపం చేస్తూ ఉండాలి.

వీరు శివాభిషేకం, ఏదైనా ఒక దేవాలయంలో ప్రతిరోజూ ప్రదక్షిణలు చేసుకోవాలి. అలాగే నూనె, నీలిరంగు వస్త్రాలు దానం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ

click me!