ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పనుల్లో కొంత ఒత్తిడి, కొంత జాడ్యం పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలకై ఖర్చు పెట్టడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణ ఉత్తమ ఫలితాలనిస్తుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఆకస్మిక లాభాలు వచ్చే సూచన. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఇతరులపై ఆధారపడతారు. సంతృప్తి ఉంటుంది. విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణునామ స్మరణ మంచివి.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) :పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. దూరదృష్టి అధికం. సంతృప్తి లోపం ఉంటుంది. ప్రయాణాల్లోఆటంకాలు వస్తాయి. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చే సూచన. దానాలు చేయడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణునామ స్మరణ మంచివి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోీల్లో గెలుపు ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. నిల్వధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. అన్ని పనుల్లో జయం లభిస్తుంది. విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణునామ స్మరణ మంచివి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఆలోచనలకు అనుగుణంగా కార్యాచరణ సాగాలి. ఊహించని ఇబ్బందులు వస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. గుర్తింపు లభించదు. చిత్త చాంచల్యాన్ని వదిలించుకోవాలి. మానసిక ప్రశాంతత అవసరం. అనవసర ఇబ్బందులు పనికిరావు. విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణునామ స్మరణ మంచివి.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాలు అభివృద్ధి చెందుతాయి. మాతృసౌఖ్యం లభిస్తుంది. సుగంధ ద్రవ్యాలపై దృష్టి పెడతారు. మృష్టాన్న భోజనంపై దృష్టి పెడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు లేకుండా జాగ్రత్త పడాలి. విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణునామ స్మరణ మంచివి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వ్యాపారస్తుల సహకారం పెరుగుతుంది. వ్యాపార ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. ఉన్నత స్థితికి చేరుకుటాంరు. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విహార యాత్రలపై దృష్టి పెడతారు. విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణునామ స్మరణ మంచివి.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నేత్ర సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. వాగ్దానాలు నెరవేరుస్తారు. అనుకున్న పనులు పూర్తి. విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణునామ స్మరణ మంచివి.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనవసర ఒత్తిడులు పెట్టుకుటాంరు. పనుల్లో ఆలస్యం ఉంటాయి. కార్యసాధనలో పట్టుదల అవసరం. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్పు చేసుకోవాలి. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణునామ స్మరణ మంచివి.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు వస్తాయి. విశ్రాంతిలోపం ఉంటుంది. పరాధీనత ఉంటుంది. మానసిక ఒత్తిడి. పాదాల నొప్పులు ఉంటాయి. విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణునామ స్మరణ మంచివి.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారస్తులకుసంతోషకాలం.వ్యాపారఅభివృద్ధి జరుగుతుంది. సమిష్టి ఆశయాలు ఉంటాయి. సమిష్టి ఆదాయాలు. కళలపైఆసక్తి పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణునామ స్మరణ మంచివి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అధికారులతో అనుకూలత ఉంటుంది. విహార యాత్రలు చేస్తారు. రాజకీయాలపై దృష్టి ఎక్కువ. వ్యాపార ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం, కీర్తి, పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. అన్ని రకాల సంతోషాలు ఉంటాయి. విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణునామ స్మరణ మంచివి.
డా.ఎస్.ప్రతిభ