గురువులకు గురువు ఎవరు?

By Udayavani DhuliFirst Published Dec 22, 2018, 9:24 AM IST
Highlights

ఈ పూర్ణిమను నరక పూర్ణిమ అనీ, కోరల పున్నమి అని,  దత్తాత్రేయ జయంతి అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. దత్తాత్రేయుడు మార్గశిర శుద్ధ చదివితినాడు అనగా పూర్ణిమ ఘడియలలో అవతరించాడు కాబట్టిఅతని జయంతిని మహారాష్ట్ర ప్రాంతంలో ఈరోజున జరుపుకుటాంరు. 

ఈ పూర్ణిమను నరక పూర్ణిమ అనీ, కోరల పున్నమి అని,  దత్తాత్రేయ జయంతి అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. దత్తాత్రేయుడు మార్గశిర శుద్ధ చదివితినాడు అనగా పూర్ణిమ ఘడియలలో అవతరించాడు కాబట్టిఅతని జయంతిని మహారాష్ట్ర ప్రాంతంలో ఈరోజున జరుపుకుటాంరు. ఈ మార్గశిర పూర్ణిమనాడు పూర్వకాలంలో రొట్టెలు కొరికి కుక్కలకు వేసేవారని ప్రతీతి. దీనికి రెండు కారణాలు ఒకి చలి బాగా ఉండడం వలన పళ్ళు కొరకడం అలవాటు. పళ్ళు దురదగా ఉంటాయి. పంటిలో విషయం ఉంటుంది. ఆ విషం పోవడానికి రొట్టెలు కొరికి వేసేవారు.

ఈ కాలం పిత్త ప్రాధాన్యత కలిగి ఉంటుంది. దానిని నివారించడానికి ఈ కాలంలో పని చేస్తారు. అజీర్ణ సంబంధమైన రోగాలు కూడా ఇప్పుడే ఎక్కువగా వస్తాయి. ఇది పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉండేకాలం. కావుననే ఈ కాలంలో వ్రతాచరణ పేరుతో మన పెద్దలు ఉపవాసాలు విధించారు. ఆ ఆచరణలో భాగంగానే దత్తజయంతి ఉంటుంది.

దత్తాత్రేయ అవతారానికి ఒక కథ ప్రచారంలో ఉంది.

బ్రహ్మవిష్ణు మహేశ్వరులను ఒకే రూపంలో చూడాలని నారదుని కోరిక. అప్పుడు భూలోకానికి అత్రిముని ఆశ్రమంలో లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చాడు. ముని భార్య అనసూయ మహాపతివ్రత. తన పాతివ్రత్యాన్ని గురించి లక్ష్మీ, పార్వతి, సరస్వతులతో చెప్పగా వారు అసూయతో తమ భర్తలను పంపి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షిస్తామని చెప్పి, త్రిమూర్తులను పంపారు. త్రిమూర్తులు బ్రాహ్మణుల వేశంలో ఆశ్రమానికి వచ్చి తమకు ఆకలిగా ఉందని అనసూయ విగత వస్త్రయై తమకు అన్నం ప్టోలని కోరారు. అత్రిముని దివ్యదృష్టితో చూసి వీరు సామాన్యులు కారని చెప్పగా వెంటనే తన భర్త ఇచ్చిన మంత్రోదకం వారిపై చల్లగా వారు పసిపిల్లలుగా మారిపోయారు. వారికి అనసూయ తన స్తన్యం ఇచ్చి తృప్తిపరిచింది.  నారదుడు అక్కడికి వచ్చి త్రిమూర్తులు చిన్నారి శిశువులై ఉన్నవారిని చూసి ఆనందించి, వారి విషయం త్రిమూర్తుల భార్యలతో చెప్పితే తమకు చూపించమన్నారు. వారు వచ్చి తమ భర్తలను తమకు ఇవ్వమని చెప్పగా అనసూయ భర్త ఆజ్ఞ మేరకు శిశువులపై మంత్రోదకాన్ని చల్లితే వారు మామూలు మనుషులౌతారు. త్రిమూర్తులు ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వరం కోరుకోమనగా త్రిమూర్తులు తమకు పుత్రుడుగా పుట్టాలని కోరారు. అలా వరప్రభావంతో జన్మించినవారే దత్తాత్రేయులు.

దత్తాత్రేయుడు ప్రకృతిని ప్రకృతిలో ఉన్న ప్రతి విషయాన్ని గురువుగా స్వీకరించాడు. ఇతనికి మొత్తం 24 మంది గురువులు. ఇంతమంది గురువులు ఉన్నదైవం మరెవరూ ఉండరు. దత్తాత్రేయుని భార్య పేరు అనఘా. అఘం = పాపం, అనఘా అంటే పాపం అంటనిది అని అర్థం.

దత్తుడు అంటే ఇవ్వబడేవాడు అని అర్థం. జ్ఞానాన్ని అందించేవాడు. దత్తాత్రేయ దేవాలయాలు,  గాణగాపురం, కురువపురం, పిఠాపురం, లాిం క్షేత్రాలు దత్త సంప్రదాయాన్ని పాించేవి ఎక్కువగా ఉంటాయి.

సాయిబాబా, నృసింహసరస్వతీ లాటివారందరూ దత్త్త సంప్రదాయ భావనలోఉన్నవారే. భగవత్‌ ప్రార్థన గట్టిగా చేసినప్పికి, గురు ప్రార్థన చేసినప్పికి వ్యక్తికి కావలసిన అవసరాలు, జ్ఞానం అందుతాయి. ఆకాశం, శక్తి రెండూ కలిసి ఉంటాయి కాబ్టి ఏదో ఒక రూపం లేదా భావన ద్వారానో మనకు సమాచారాన్ని అందించేవాడు గురువు. భగవంతుడిని చూపించే శక్తి, భగవంతుడు అంటే ఎవరో కూడా చెప్పేవారే గురువులు. దత్తాత్రేయ స్వామి దగ్గర 4 కుక్కలు నాలుగు వేదాలకు ప్రతీకలు.

శిష్యులలోని అంధకారం అనే చీకిని, అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవారు గురువులు. ఆ గురువులకే గురువు దత్తాత్రేయస్వామి. కాబట్టే తాను లోకగురువైనాడు. ఆకాశ తత్త్వానికి సంబంధించినవాడు గురువు. ఆకాశం లేనిచోటు అనేది ఉండదు. కాబ్టి గురువు లేని ప్రదేశం ఎక్కడా ఉండదు. తల్లి మొది గురువు. ఆ తల్లికే గురువు దత్తాత్రేయ స్వామి. ఆ స్వామి ఆరాధనను చేసి అందరూ లోకంలో అంధకారాన్ని తీసేసి జ్ఞానాన్ని పెంచుకునే మార్గంలో ప్రయాణం చేద్దాం.

డా|| ఎస్‌. ప్రతిభ

click me!