ఈ వారం(డిసెంబర్21నుంచి 27వ తేదీ వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వాక్ చాతుర్యం తగ్గుతుంది. అనుకున్న పనుల్లో ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో అసౌకర్యం ఉంటుంది. సంప్రదింపుల్లో అనుకూలత ఉంటుంది. సౌకర్యాలోపాలు ఇబ్బందికి గురిచేస్తాయి. గౌరవలోపాలు కలగకుండా జాగ్రత్త పడాలి. విశ్రాంతి ఉండదు. సౌకర్యాలవల్ల ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం. శ్రీమాత్రే నమః జపం ఉపకరిస్తుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. కార్యసాధనలో పట్టుదల అవసరం. కుటుంబ సంబంధాలపై దృష్టి ఉంటుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంప్రదిపుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు తప్పకపోవచ్చు. కాలం వృథా అవుతుంది. పరిచయాలు స్నేహ సంబంధాలు విస్తరిస్తాయి. పెద్దలతో అనుబంధాలు సంతోషాన్నిస్తాయి. శ్రీరామ జయరామ జయజయరామరామజపం.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. బాధ్యతలున్నా సంతోషం, సంతృప్తి ఉంటుంది. మాట విలువ తగ్గే సూచనలు ఉన్నాయి. పోటీల్లో విజయం, గుర్తింపు లభిస్తాయి. పెద్దలతో జాగ్రత్త అవసరం. శ్రీ దత్త శ్శరణం మమ జపం మేలు చేస్తుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. నిర్ణయాదుల్లో తొందరపాటు పనికిరాదు. ఖర్చులు పెట్టుబడులు ఉంటాయి. సౌకర్యంగా ఉంటారు. అనుక్ను పనులు నెరవేరుతాయి. ఆర్థికాంశాల్లో అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వాములతో చికాకులు ఏర్పడతాయి. మానసిక పరమైన ఒత్తిడులు ఉంటాయి. పోటీల్లో, విజయం, గుర్తింపు లభిస్తాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మేలు చేస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉంటుంది. అధికారిక ప్రయాణాలు అవసరమౌతాయి. అధికారులతో అనుకూలత ఉంటుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంటుంది. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. సుఖంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ఆలోచనల్లో ఒత్తిడికి అవకాశం ఉంటుంది. పోటీల్లో ఓడిపోయినా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ వర్గీయుల సహకారం లభిస్తుంది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. పనులు పూర్తి కావాలంటే అధిక శ్రమ తప్పనిసరిగా ఉంటుంది. సంతృప్తి తక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. గౌరవం పెంచుకుటాంరు. లాభాలున్నా అనుకూలత ఉండదు. తొందరపాటు పనికిరాదు. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. మాటల్లో చమత్కారం ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఏర్పడతాయి.విందు వినోదాల్లో పాల్గొటాంరు. శ్రీమాత్రేనమః జపం.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనుకోని ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రమలేని సంపాదనపై దృష్టి వెళుతుంది. ఉన్నత వ్యవహారాలపై దృష్టి పెడతారు. లక్ష్యాలను సాధించే దిశగా పయనిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలు ఉంటాయి. ఆర్థిక నిల్వలు పెంచుకుటాంరు. మాట విలువ పెరుగుఉంది. వ్యాపారాదుల్లో మంచి పెడట్టుబడులు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత ఉంటుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం ఉంటుంది. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు అనారోగ్య భావనలు ఉంటాయి. లక్ష్యాలను సాధించేవైపు దృష్టి ఉంటుంది. ఆర్థికాంశాల్లో ఒత్తిడులు ఉంటాయి. నూతన నిర్ణయాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు ఉంటుంది. విహారాలకోసం ఖర్చులు అధికం. శ్రీమాత్రే నమః జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : నూతన పరిచయాలు స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. పనుల్లో కొంత జాగ్రత్త అవసరం. భాగస్వాములతో ఇబ్బందులు కూడా ఉంటాయి. ధార్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. పనుల్లో ఆలస్యం, చికాకులు ఏర్పడతాయి. అనారోగ్య భావనలు ఉంటాయి. వ్యాపార లోపాలకు అవకాశం జాగ్రత్త అవసరం. లక్ష్యాలను సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి ఉంటుంది. సృజనాత్మకను కోల్పోతారు. అనవసర ఆలోచనలు చేస్తారు. వ్యతిరేక ప్రభావాలుటాంయి. పోటీలున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు స్నేహ సంబంధాల్లో జాగ్రత్త అవసరం. కొత్త పరిణామాలుటాంయి. నిర్ణయాదుల నిర్వహణ కోసం ఖర్చులు అధికం. కుటుంబ ఆర్థికాంశాల్లో అప్రమత్తంగా ఉంటడాలి. లాభాలు సంతోషాన్నిస్తాయి. శ్రీమాత్రే నమః జపం మేలు చేస్తుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : స్నేహ సంబంధాలు విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణౄలకు అవకాశం ఉంటుంది. మాతృవర్గ సహకారం ఉంటుంది. అభీష్టాలు నెరవేరుతాయి. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. పోటీల్లో విజయం ఉంటుంది. నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. సృజనాత్మకత లోపం ఉంటుంది. ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. భాగస్వామాల్లో సంతోషం ఏర్పడుతుంది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్తిక నిల్వలపై దృష్టి పెడతారు. సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మానసిక ఒత్తిడులు ఉంటాయి. విహారాల్లో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. మానసికమైన ఒత్తిడులు ఉంటాయి. లాభాలు ఆశించినంతగా ఉండవు. నూతన కార్యక్రమాలు చేపడతారు. సంప్రదింపుల్లో లోపాలు ఉంటాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ