Today Rasi Phalalu: ఈ రాశుల వారికి వ్యాపారంలో లాభాలే లాభాలు..!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.  ఈ దిన ఫలాలు 18.03.2025 మంగళవారానికి సంబంధించినవి.


మేష రాశి ఫలాలు

ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట అకారణంగా గొడవలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. పనులు మందకోడిగా సాగుతాయి.

వృషభ రాశి ఫలాలు

ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు వస్తాయి. విలువైన వస్తువులు కొంటారు.

మిథున రాశి ఫలాలు

Latest Videos

ఆకస్మిక ధన లాభం కలుగవచ్చు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు.

కర్కాటక రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలు అంతంత మాత్రమే. వ్యాపారంలో ఒడిదుడుకులు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు  కలసిరావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు వస్తాయి.

సింహ రాశి ఫలాలు

ఉద్యోగంలో సమస్యలు తప్పవు. రావాల్సిన డబ్బు టైంకి అందక ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం దక్కదు.

కన్య రాశి ఫలాలు

వ్యాపారాల్లో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు సాధారణం. కొత్త పరిచయాలు ఉత్సాహన్నిస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

తులా రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనుల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృశ్చిక రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల ప్రశాంతత ఉండదు. కొన్ని పనులు అతీకష్టం మీద పూర్తవుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరస్తి వివాదాలు ఉంటాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు.

ధనస్సు రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రమే. దైవ చింతన పెరుగుతుంది. కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి.

మకర రాశి ఫలాలు

విలువైన వస్తువులు కొంటారు. ప్రముఖుల నుంచి సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు టైంకి పూర్తవుతాయి. ఉద్యోగంలో అనుకూలం. ఆప్తుల సాయంతో కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి.

కుంభ రాశి ఫలాలు

ఇంటా, బయట గందరగోళ వాతావరణం ఉంటుంది. కంటి సంబంధిత సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో తొందరపాటు మంచిదికాదు. బంధు, మిత్రుల మాటలు మానసికంగా బాధిస్తాయి. కొన్ని పనులు శ్రమతో గాని పూర్తి కావు.

మీన రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. కుటుంబం విషయంలో కొన్ని ఆలోచనలను అమలు చేస్తారు. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.

 

click me!