Today Rasi Phalalu: ఈ రాశి వారు విలువైన బహుమతులు అందుకుంటారు.. శుభవార్తలు వింటారు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 16.03.2025 ఆదివారానికి సంబంధించినవి.


మేష రాశి ఫలాలు

పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తిస్తారు. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. లాభాలు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది.

వృషభ రాశి ఫలాలు

ఉద్యోగులు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అనుకూలం. ముఖ్యమైన పనుల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి.

మిధున రాశి ఫలాలు

Latest Videos

దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలతో మనస్పర్థలు వస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కర్కాటక రాశి ఫలాలు

మిత్రులపై మీకున్న అభిప్రాయాన్ని మార్చుకుంటారు. పనులు టైం కి పూర్తికావు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప  వివాదాలు వస్తాయి.  ఉద్యోగులు అధికారుల కోపానికి గురికావాల్సి వస్తుంది. వ్యాపారాలు నెమ్మదిస్తాయి.

సింహ రాశి ఫలాలు

అందరితో సఖ్యతగా ఉంటారు. వాహన యోగం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా అనుకూలం. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది.

కన్య రాశి ఫలాలు

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. బంధు, మిత్రులు సహకారం అందిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలం. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభం కలుగవచ్చు.

తులా రాశి ఫలాలు

ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేరు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. కొందరి ప్రవర్తన మానసికంగా ఇబ్బంది పెడుతుంది.  విలువైన వస్తువుల విషయంలో  జాగ్రత్త అవసరం.  వ్యాపారం అంతగా కలిసిరాదు.

వృశ్చిక రాశి ఫలాలు

అవసరానికి చేతిలో డబ్బుండదు. ఆప్తులతో మనస్పర్థలు వస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు.  వృత్తి, వ్యాపారాలు సాధారణం. వాహన కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

ధనస్సు రాశి ఫలాలు

అన్ని వైపుల నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వస్తువులు కొంటారు. తోబుట్టువుల నుంచి ఊహించని విధంగా డబ్బు సాయం అందుతుంది.

మకర రాశి ఫలాలు

ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగులకు అంతంతమాత్రంగా ఉంటుంది. ఊహించని విమర్శలు వస్తాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి. అనవసర వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కుంభ రాశి ఫలాలు

విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అనుకూలం. పిల్లల చదువు విషయంలో సంతోషంగా ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

మీన రాశి ఫలాలు

ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి.  వృత్తి, ఉద్యోగాల్లో ట్రాన్స్ ఫర్ సూచనలున్నాయి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో అవరోధాలు వస్తాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు పనికిరాదు.

click me!