ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 13.04.2025 ఆదివారానికి సంబంధించినవి.
బంధువులతో వివాదాలు వస్తాయి. ఇంటి నిర్మాణ ఆలోచనలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నిరాశ తప్పదు.
బంధువర్గం నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగం ఉంది. సన్నిహితులతో సఖ్యతగా ఉంటారు. కొన్ని వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి.
ఆత్మీయుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు అనుకూలం. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధు, మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణం.
నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు వస్తాయి. ఇంటా బయట గందరగోళ వాతావరణం ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నిరాశ తప్పదు.
సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం ఉంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.
చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలం. వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగాల్లో ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల కొత్త అప్పులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
అవసరానికి సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కలిసివస్తాయి.
ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. దూర ప్రయాణాల్లో ప్రముఖులతో పరిచయాలు కలిసివస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభదాయకం.
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.